Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Suryakumar Yadav: ‘టీమిండియా కష్టాల్లో ఉంటే.. హాయిగా తింటున్నావా?’.. సూరీడుని ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్!

టీమిండియా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్‌కు చెందిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ స్కైని తెగ ట్రోల్ చేస్తున్నారు.

వన్డే వరల్డ్ కప్ ఆడుతున్న 15 మంది టీంలో చోటు దక్కించుకున్న సూర్యకుమార్ యాదవ్.. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఫైనల్ ఎలెవెన్‌లో మాత్రం స్థానం దక్కించుకోలేకపోయాడు. అయితే మైదానంలోకి దిగి మ్యాచ్ ఆడకపోయినా డగౌట్ నుంచే స్కై ఇప్పుడు వైరల్ అవుతున్నాడు.

World cup 2023 Funny video of Suryakumar Yadav in dug-out going viral

సాధారణంగానే మైదానంలో ఉండే కెమెరాలు ప్రతి విషయాన్ని క్యాప్చర్ చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే భారత్ 18 పరుగుల వద్ద ఆడుతున్న సమయంలో టీమిండియా డగౌట్ వైపు ఫీల్డ్ కెమెరామెన్ తన కెమెరాని తిప్పాడు. అదే సమయంలో అక్కడ కూర్చున్న స్కై.. ఎంచక్కా స్నాక్స్ తింటున్నాడు.

కెమెరా తనవైపు తిరిగిందని బిగ్ స్క్రీన్‌లో గమనించిన స్కై.. వెంటనే నోటిలో ఉన్న ఆహారాన్ని నమలడం ఆపేశాడు. తల తిప్పకుండా కేవలం కళ్లు మాత్రమే తిప్పుతూ కెమెరా ఎటు నుంచి తనను చూస్తోందా..? అని గమనించాడు. ఇదంతా కెమెరాలో రికార్డ్ కావడంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ వీడియో చూసిన ఫ్యాన్స్.. స్కైని ట్రోల్ చేస్తూ రకరకాల మీమ్స్ షేర్ చేస్తున్నారు. 'పెళ్లిలో తింటున్నప్పుడు ఒక్కసారిగా కెమెరా మనవైపు ఫోకస్ అయితే ఇలానే చేస్తాం కదా..' అని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే.. 'ఒకపక్క టీమిండియా కష్టాల్లో ఉంటే టెన్షన్ పడాల్సింది పోయి హాయిగా స్నాక్స్ తింటున్నావా..?' అంటూ మరో నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఇక వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఆదివారం చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయం దక్కించుకుంది. స్లో వికెట్‌పై మొదట భారత బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేయడంతో ఆస్ట్రేలియా 199 పరుగులకే ఆలౌట్ అయింది.

అయితే 200 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్‌కు మొదట్లోనే భారీ దెబ్బ తగిలింది. ఆసీస్ పేసర్లు స్టార్క్, హేజల్‌వుడ్ దెబ్బకు భారత్ 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో క్రీజులోకొచ్చిన విరాట్ కోహ్లీ (85), కేఎల్ రాహుల్ (97*) నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను నడిపించి చివరికి అద్భుతమైన విజయాన్నందించారు.

Story first published: Tuesday, October 10, 2023, 22:11 [IST]
Other articles published on Oct 10, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+