అహ్మదాబాద్: ఐసీసీ ప్రపంచ కప్ 2023 ఫైనల్స్‌లో భారత్‌ను ఢీ కొట్టే ప్రత్యర్థి ఎవరనేది తేలిపోయింది. రెండో సెమీ ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది ఆస్ట్రేలియా. ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. ఈ నెల 19వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్స్‌లో భారత్‌తో తలపడుతుంది.
ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోవడానికి జట్టు సన్నద్ధమౌతోంది. నెట్స్‌లో కఠోరంగా శ్రమిస్తోంది. కేప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, ప్రసిద్ధ్ కృష్ణ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తోన్నారు. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ సారథ్యంలో ప్రాక్టీస్ సెషన్ కంటిన్యూ అవుతోంది.

అటు ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ కోసం సమరోత్సాహంతో ఉంది. బలమైన దక్షిణాఫ్రికాను సెమీ ఫైనల్స్‌లో మట్టికరిపించిన దూకుడు మీద కనిపిస్తోందా జట్టు. సొంత గడ్డపై చెలరేగుతున్న భారత్‌ను కట్టడి చేయడానికి సర్వశక్తులనూ ఒడ్డుతోంది. ఇందులో భాగంగా నెట్స్‌లో చెమటోడ్చుతుంది.
ఈ మ్యాచ్‌ను తిలకించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్నారు. విజేతకు ఆయనే స్వయానా ట్రోఫీని బహూకరించే అవకాశాలు లేకపోలేదు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, బీసీసీఐ ఛైర్మన్ రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా, పలువురు రాజకీయ నాయకులు, బాలీవుడ్ సెలెబ్రిటీలు హాజరు కానున్నారు.
ఆస్ట్రేలియా నుంచి ఆ దేశ ఉప ప్రధానమంత్రి రిచర్డ్ మార్లెస్ మ్యాచ్ చూడటానికి రానున్నారు. రక్షణ మంత్రిత్ శాఖను కూడా ఆయనే పర్యవేక్షిస్తోన్నారు. తొలుత ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని అల్బెనీస్ వస్తారని భావించారు గానీ ఆయన షెడ్యూల్ ఖరారు కాలేదు. దీనితో ఉప ప్రధాని అహ్మదాబాద్‌కు రానున్నారు. మోదీతో కలిసి ప్రజెంటేషన్ కార్యక్రమంలో పాల్గొంటారయన.