For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

World Cup 2023: వీళ్లంతా వరల్డ్ కప్ లు ఆడిన తండ్రీకొడుకులు.. లిస్టులో మనవాళ్లు కూడా!

తండ్రి పేరు నిలబెట్టిన తనయుడు అనే మాట మనం చాలా సార్లు వింటూనే ఉంటాం. అలా క్రికెట్లో కూడా చాలామంది తండ్రీ, కొడుకులు తమ ట్యాలెంట్‌తో దేశానికి ప్రాతినిథ్యం వహించడమే కాకుండా ఏకంగా ప్రపంచకప్‌ ఆడిన జట్లలో స్థానం సంపాదించుకున్నారు. అలాంటి కొంతమంది తండ్రీ కొడుకుల జంటల గురించి ఇప్పుడు తెలుసుకుందాం

రోజర్ బిన్నీ, స్టువర్ట్ బిన్నీ : భారత్ తరపున వన్డే వరల్డ్ కప్ ఆడిన తండ్రీ కొడుకుల లిస్ట్‌లో రోజర్ బిన్నీ, స్టువర్ట్ బిన్నీ ఉన్నారు. రోజర్ బిన్నీ 1983లో వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉండగా.. స్టువర్ట్ బిన్నీ 2015 ప్రపంచకప్ ఆడిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు

World Cup 2023 Father and son duo who played world cups

జెఫ్ మార్ష్, మిషెల్ మార్ష్, షాన్ మార్ష్ : జెఫ్ మార్ష్ 1987లో ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడు కాగా.. అతడి కుమారులు మిచెల్ మార్ష్, షాన్ మార్ష్ ఇద్దరూ ఆస్ట్రేలియా తరపున ప్రపంచకప్‌లు ఆడారు. 2015లో మైఖేల్ క్లార్క్ కెప్టెన్సీలో ప్రపంచకప్ గెలుచుకున్న జట్టులో మిచెల్ మార్ష్ కూడా ఉన్నాడు. ఇక 2019లో ప్రపంచకప్‌లో షాన్ మార్ష్ ఆస్ట్రేలియా తరపున ఆడాడు.

World Cup 2023 Father and son duo who played world cups

కెవిన్ కుర్రన్, టామ్ కుర్రన్, శామ్ కర్రాన్ : కెవిన్ కర్రాన్ 1987లో జింబాబ్వే తరపున ప్రపంచకప్ ఆడాడు. అతడి కుమారులు టామ్ కర్రాన్, శామ్ కర్రాన్‌లు ఇంగ్లండ్ తరపున ప్రపంచకప్‌‌ ఆడారు. 2019లో ప్రపంచకప్ నెగ్గిన ఇంగ్లీష్ జట్టులో టామ్ కర్రాన్ సభ్యుడు కాగా.. ప్రస్తుతం 2023లో శామ్ కర్రాన్ ఇంగ్లీష్ జట్టులో సభ్యుడిగా బరిలోకి దిగాడు.

World Cup 2023 Father and son duo who played world cups

క్రిస్ బ్రాడ్, స్టువర్ట్ బ్రాడ్ : క్రిస్ బ్రాడ్ 1987లో జరిగిన ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ తరపున ప్రపంచకప్ ఆడాడు. క్రిస్ కుమారుడు స్టువర్ట్ బ్రాడ్ ఏకంగా ఇంగ్లండ్ తరపున 3 ప్రపంచకప్‌లు ఆడాడు. 2007, 2011, ఇంకా 2015ల్లో జరిగిన ప్రపంచకప్‌లలో స్టార్ బౌలర్‌గా నిలిచాడు.
World Cup 2023 Father and son duo who played world cups

రాడ్ లాథమ్, టామ్ లాథమ్ : 1992లో న్యూజిల్యాండ్ తరపున రాడ్ లాథమ్ ప్రపంచకప్ ఆడాడు. ఇక టామ్ లాథమ్ ఇప్పటికే 2015, 2019ల్లో న్యూజిల్యాండ్ తరపున ప్రపంచకప్‌లు ఆడడమే కాకుండా ఇప్పుడు ముచ్చటగా మూడోసారి 2023లో ప్రపంచకప్ ఆడుతున్నాడు.

World Cup 2023 Father and son duo who played world cups

టిమ్ డీ లీడ్స్, బాస్ డీ లీడ్స్ : టిమ్ లీడ్స్ 1996, 2003ల్లో నెదర్లాండ్స్ తరపున ప్రపంచకప్‌ ఆడాడు. అతడి కుమారుడు బస్ డే లీడ్స్ ఇప్పుడు 2023 ప్రపంచకప్‌లో ఆడుతున్న నెదర్లాండ్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.

ఇది ప్రపంచకప్‌లో సభ్యులుగా అరుదైన తండ్రీకొడుకుల జంటలు. వీళ్లే కాకుండా సునీల్ గావస్కర్-రోహన్ గావస్కర్, పీటర్ పొల్లాక్-షాన్ పొల్లాక్, హనీఫ్ మహ్మద్-షోయబ్ మహ్మద్, విజయ్ మంజ్రేకర్-సంజయ్ మంజ్రేకర్, వాల్టర్ హాడ్లీ-రిచర్డ్ హాడ్లీ వంటి ఇంకొంతమంది తండ్రీకొడుకులు ప్రపంచకప్ ఆడకపోయినా తమ తమ దేశాల తరపున అంతర్జాతీయ క్రికెట్ మాత్రం ఆడారు.

Story first published: Saturday, October 7, 2023, 16:31 [IST]
Other articles published on Oct 7, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+