Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: వరల్డ్ కప్‌లో మోస్ట్ డేంజరస్ బౌలర్.. హ్యాట్రిక్ తీసిన స్టార్క్‌ బౌలింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా!

వరల్డ్ కప్ వంటి కీలకమైన టోర్నీ కోసం అన్ని జట్లు గట్టిగా రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్ వంటి జట్లు ఈ టోర్నీ కోసం ఎప్పటి నుంచో సన్నాహకాలు మొదలు పెట్టేశాయి. ఈ క్రమంలో తమ ఏర్పాట్లు ఎంత వరకు వచ్చాయని తెలుసుకోవడం కోసం వరల్డ్ కప్ వార్మప్ మ్యాచులను ఎంచుకున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా కూడా తమ వార్మప్ మ్యాచులో అదరగొట్టింది. నెదర్లాండ్స్‌తో జరిగిన ఈ మ్యాచుకు కూడా వర్షం వల్ల అంతరాయం కలిగింది.

దీంతో 23 ఓవర్లకు కుదించిన మ్యాచులో ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసి 166 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆసీస్ బౌలర్లు అదరగొట్టారు. ముఖ్యంగా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ హ్యాట్రిక్‌తో సత్తా చాటాడు. ఇది చూసిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఈ ఏడాది జరిగిన యాషెస్ సిరీసులో స్టార్క్ గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీసులో అతను ఆడలేదు.

Australia star pacer is peaking at the right moment

తాజాగా భారత్‌తో జరిగిన వన్డే సిరీసులో చివరి మ్యాచులో స్టార్క్ రీఎంట్రీ ఇచ్చాడు. ఈ మ్యాచులో ఫర్వాలేదనిపించాడు. వరల్డ్ కప్‌లో అత్యంత ప్రమాదకరమైన బౌలర్లలో ఒకడైన స్టార్క్.. ఇంకా గాడిన పడలేదని అంతా అనుకున్నారు. అలాంటి వారందరికీ షాకిస్తూ వార్మప్ మ్యాచులో హ్యాట్రిక్ తీశాడీ ఆసీస్ పేసర్. ఇది చూసిన ఫ్యాన్స్ తమ సంతోషాన్ని ఆపుకోలేకపోతున్నారు. సరిగ్గా వరల్డ్ కప్ సమయానికి స్టార్క్ చెలరేగుతున్నాడని అంటున్నారు.

అతను ఇలాగే రాణిస్తే వరల్డ్ కప్‌లో మిగతా జట్లకు చాలా డేంజర్ అని అంటున్నారు. ఈ టోర్నీలో స్టార్క్ ఒక్కడి వల్ల ఆసీస్ చాలా ప్రమాదకరంగా తయారైందని కామెంట్స్ చేస్తున్నారు. 'స్టార్క్ వచ్చేస్తున్నాడు. మిగతా టీమ్స్ జాగ్రత్త' అంటూ హెచ్చరికలు చేస్తున్నారు. ఏదేమైనా ఆస్ట్రేలియాకు మాత్రం ఇది శుభవార్తే అని సంతోషిస్తున్నారు ఫ్యాన్స్.

Story first published: Sunday, October 1, 2023, 11:52 [IST]
Other articles published on Oct 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+