For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Glenn Maxwell: మ్యాక్సీ మామ హీరోగా ‘కాంతార-2’.. అదిరిపోయిందిగా!

గతేడాది దేశవ్యాప్తంగా బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొట్టిన చిత్రాల్లో కన్నడ హిట్ 'కాంతార' ఒకటి. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్.. ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించింది. అయినా ఇప్పుడివన్నీ ఎందుకు చెప్తున్నాడా? అని చూస్తున్నారా? కారణం ఉంది. ఆఫ్ఘనిస్తాన్‌పై డబుల్ సెంచరీతో చెలరేగిన మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్స్‌ను మనం ఇప్పుడప్పుడే మర్చిపోలేం కదా.

దాన్ని మరింత ఇంపాక్ట్‌ఫుల్‌గా చేసేందుకు కొందరు ఫ్యాన్స్ ప్రయత్నించారు. దీని కోసం కాంతార క్లైమాక్స్ సీన్‌ను యూజ్ చేసుకున్నారు. ఆ సీన్‌లో హీరో కింద పడిపోయి ఉంటే.. అతని తండ్రి ఆత్మ రూపంలో వచ్చి తల వద్ద పెద్దగా అరుస్తాడు. అప్పుడు సడెన్‌గా హీరో కళ్లు తెరిచి బీభత్సమైన ఫైట్ చేస్తాడు. ఇప్పుడు అదే సీన్‌ను మ్యాక్సీ ఇన్నింగ్స్‌కు యాడ్ చేశారు.

World Cup 2023 Fans turn Glenn Maxwell innings into Kantaara-2 trailer

తన ఇన్నింగ్స్ మధ్యలో కాలి కండరాలు పట్టేయడంతో మ్యాక్స్‌వెల్ ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. దీంతో బొక్కబోర్లా పడుకొని ఉన్న మ్యాక్స్‌వెల్‌కు కూడా కాంతారలో జరిగినట్లే జరిగినట్లు ఈ వీడియోను ఎడిట్ చేశారు. ఆ తర్వాత పైకి లేచిన మ్యాక్సీ.. ఎడాపెడా బౌండరీలు బాదేస్తూ ఈ వీడియోలో కనిపించాడు. ఇది చూసిన చాలా మంది ఫ్యాన్స్.. ఇదెక్కడి క్రియేటివిటీరా బాబూ? అని ఆశ్చర్యపోతున్నారు.

ఈ మ్యాచులో మ్యాక్స్‌వెల్ 201 పరుగులతో అజేయంగా నిలిచి, తన టీంకు విజయం అందించిన సంగతి తెలిసిందే. టాపార్డర్, మిడిలార్డర్ అందరూ ఫెయిలైన సమయంలో క్రీజులోకి వచ్చిన మ్యాక్స్‌వెల్.. ఆఫ్ఘన్ ఫీల్డర్లు తన క్యాచులు వదిలేయడాన్ని చక్కగా యూజ్ చేసుకున్నాడు. ఎడాపెడా బౌండరీలు బాదేసిన అతను కేవలం 128 బంతుల్లోనే 201 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.

ఈ విజయంతో ఆసీస్‌కు సెమీస్ బెర్తు దాదాపు ఖాయమైంది. కాకపోతే అది మూడో స్థానంలో సెమీస్ చేరుతుందా? లేక నాలుగో స్థానానికి పడిపోతుందా? అనేది చూడాలి. మిగతా జట్లేవీ ప్రస్తుతం ఆసీస్‌కు అంత పోటీ ఇవ్వలేకపోతున్న సంగతి తెలిసిందే

Story first published: Thursday, November 9, 2023, 13:41 [IST]
Other articles published on Nov 9, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+