Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsBAN:ఇక షమీని ఫైనల్లో ఆడిస్తారా?.. టీంలోకి ఎందుకు తీసుకున్నారు?.. టీమిండియాపై ఫ్యాన్స్ ఫైర్!

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో కూడా మహమ్మద్ షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. 'ఈ మ్యాచ్‌‌కి కూడా షమీని తీసుకోకపోవడం ఏంటి..? అతడిని ఇక నేరుగా ఫైనల్లోనే ఆడిస్తారా..?' అంటూ సోషల్ మీడియా వేదికగా టీమిండియాను తెగ ట్రోల్ చేస్తున్నారు.

పూణే వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతోంది టీమిండియా. ఈ మ్యాచ్‌‌లో పాకిస్తాన్‌తో ఆడిన జట్టుతోనే టీమిండియా బరిలోకి దిగుతోంది. కానీ జట్టులో మార్పులు చేయకపోవడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

World Cup 2023 Fans troll Team India for not picking Mohammed Shami

శార్దూల్ ఠాకూర్ స్థానంలో షమీని ఎందుకు తీసుకోవడం లేదని టీమిండియాని నిలదీస్తున్నారు. శార్దూల్‌తో పోల్చితే షమీ సూపర్ బౌలర్ అని, వికెట్లు పడగొట్టడమే కాకుండా బ్యాటింగ్‌లో కూడా 8వ స్థానంలో అవసరమైన పరుగులు చేయగల సత్తా అతడి సొంతమని కామెంట్లు చేస్తున్నారు.

'షమీని ఆడించడానికి ఇంతకుమించిన అవకాశం మరొకటి వస్తుందా..? భారత బ్యాటింగ్‌ లైనప్ అద్భుతంగా ఉంది. ఇలాంటి టైంలో ఒక్క మ్యాచ్‌లో అది కూడా బంగ్లాదేశ్‌పై షమీని ఆడిస్తే ఏమవుతుంది? ' అని ఎక్స్ వేదికగా ఓ యూజర్ కామెంట్ చేస్తే.. మరో యూజర్ 'వీళ్ల తీరు చూస్తుంటే షమీని నేరుగా ఫైనల్లోనే ఆడించేలా ఉన్నారే..?' అని ట్రోల్ చేస్తున్నారు.

ఇంకో నెటిజన్ అయితే.. 'అసలు మహమ్మద్ షమీ చేసిన తప్పేంటి..? జట్టులో అతడిని తీసుకోకపోవడానికి కారణం ఏంటి..? ఒకపక్క శార్దూల్‌కు వరుస అవకాశాలు ఇస్తున్నారు. జట్టులో ఇప్పటికే ఏడుగురు బ్యాట్స్‌మెన్ ఉన్నప్పటికీ టీమిండియా తమ బ్యాటింగ్‌ను నమ్మలేకపోతోందా..? మరో ఆల్ రౌండర్ కోసం శార్దూల్‌ను తీసుకుంటున్నారు..?' అని టీమిండియాను ఏకి పారేశాడు.

World Cup 2023 Fans troll Team India for not picking Mohammed Shami

ఇదిలా ఉంటే వరల్డ్ కప్‌ టోర్నీలో టీమిండియా ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడింది. అందులో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌ మినహా మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ శార్దూల్ ఠాకూర్ జట్టులో ఉన్నాడు. ఇప్పుడు బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లోనూ శార్దూల్‌ను జట్టులోకి తీసుకుంది టీమిండియా.

ఆఫ్ఘన్‌పై శార్దూల్ 6 ఓవర్లలో 31 పరుగులిచ్చి 1 వికెట్ మాత్రమే తీయగలిగాడు. ఆ తర్వాత పాకిస్తాన్‌తో కేవలం 2 ఓవర్లు మాత్రమే వేసిన శార్దూల్ వికెట్లేమీ తీయకుండా 12 పరుగులిచ్చాడు. ఇక ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాడు.

Story first published: Thursday, October 19, 2023, 17:05 [IST]
Other articles published on Oct 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+