Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsNZ: నెంబర్ వన్ ర్యాంకు వద్దేంట్రా?.. గిల్‌పై పేలుతున్న మీమ్స్!

వరల్డ్ కప్‌లో 20 ఏళ్ల తర్వాత న్యూజిల్యాండ్‌ను టీమిండియా ఓడించింది. ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. భారీ స్కోరు చేసేలా కనిపించింది. తన క్యాచ్ నేలపాలు చేసిన రవీంద్ర జడేజా.. ఎంత తప్పు చేశానని బాధ పడేలా రచిన్ రవీంద్ర (75) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

అతనికి జత కలిసిన డారియల్ మిచెల్ (130) కూడా చెలరేగాడు. అయితే చివర్లో మహమ్మద్ షమీ ఐదు వికెట్లతో సత్తా చాటడంతో కివీస్ కేవలం 273 పరుగులు మాత్రమే చేయగలిగింది. మిచెల్, రవీంద్ర మినహా మిగతా ఏ బ్యాటర్‌నూ క్రీజులో కుదురుకోనివ్వలేదు భారత బౌలర్లు. దీంతో ఆ టీం ఆశించిన భారీ స్కోరు చేయలేకపోయింది.

World Cup 2023 Fans troll Shubman Gill for failing

ఇక లక్ష్య ఛేదనను భారత్ దూకుడుగానే ఆరంభించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (46) మరోసారి ధనాధన్ షాట్లతో జట్టుకు అదిరే ఆరంభం అందించాడు. అతనితోపాటు శుభ్‌మన్ గిల్ (26) కూడా ఇన్నింగ్స్ చక్కగా ఆరంభించాడు. కానీ ఆ తర్వాత అనవసరంగా షార్ట్ బాల్‌ను ఆడబోయి మిచెల్‌కు క్యాచ్ ఇచ్చాడు.

మంచి టచ్‌లో కనిపిస్తున్న ఈ యంగ్ ఓపెనర్ అదే జోరు కొనసాగిస్తే.. వన్డేల్లో నెంబర్ వన్ బ్యాటర్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం నెంబర్ వన్ ర్యాంకులో ఉన్న పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ పెద్దగా ఫామ్‌లో లేడు. దీంతో గిల్ ముందు మంచి అవకాశం ఉంది. కానీ అతను మాత్రం ఇలా చెత్త షాట్లు ఆడి అవుట్ అవుతున్నాడని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

వన్డేల్లో టాప్ బ్యాటర్ ర్యాంకు ఎలాగైనా గిల్‌కు వచ్చేస్తుందని అనుకున్న ఫ్యాన్స్.. ఇలా గిల్ తేలిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. బాబర్ తన ర్యాంకు ఇచ్చేయడానికి రెడీగా ఉన్నా.. గిల్ మాత్రం దాన్ని తీసుకోవడం లేదు. సరిగ్గా రెండు మ్యాచులు ఆడితే ఈ ర్యాంక్ వచ్చేస్తుందని అనుకుంటే ఇలా గిల్ విఫలం అవుతున్నాడని ఫ్యాన్స్ చికాకు పడుతున్నారు.

Story first published: Monday, October 23, 2023, 9:31 [IST]
Other articles published on Oct 23, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+