Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: ఓడింది ఇంగ్లండ్.. కానీ ట్రోలింగ్ మాత్రం పాక్‌పై?

వన్డే వరల్డ్ కప్‌లో షాకింగ్ ఫలితం వెలుగు చూసింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను ఆఫ్ఘనిస్తాన్ చిత్తు చేసింది. ఏకంగా 69 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్‌ అద్భుతంగా ఆడింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న రహ్మనుల్లా గుర్బాజ్ (80) టీ20 తరహా బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.

అతనితోపాటు ఇబ్రహీం జద్రాన్ (28) కూడా ఫర్వాలేదనిపించాడు. అయితే వన్ డౌన్‌లో వచ్చిన రహ్మత్ షా (3), కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ (14), అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (19) రాణించలేదు. అయితే తన తొలి మ్యాచ్ ఆడుతున్న ఇక్రమ్ అలిఖిల్ (58) చూడచక్కని ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో రషీద్ ఖాన్ (23), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (28) కూడా ఫర్వాలేదనిపించారు.

World Cup 2023 Fans troll Pakistan after Afghanistan beat England

దీంతో ఆ జట్టు 49.5 ఓవర్లలో 284 పరుగులు ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ తేలిపోయింది. ఒక్క హ్యారీ బ్రూక్ (66) మినహా అందరూ విఫలమయ్యారు. దీంతో ఈ లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఛేజ్ చేయలేకపోయింది. చివర్లు 40.3 ఓవర్లలో 215 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. ముజీబ్ ఉర్ రెహ్మాన్ వరుసగా మూడు వికెట్లు కూడా తీసుకున్నాడు.

ఇలా ఇంగ్లండ్ ఓడిపోయినా కూడా ఫ్యాన్స్ మాత్రం పాకిస్తాన్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఇంతకుముందు అహ్మదాబాద్‌లో భారత్‌తో జరిగిన మ్యాచులో పాకిస్తాన్ చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం పాక్ క్రికెట్ డైరెక్టర్ మిక్కీ ఆర్థర్ మాట్లాడుతూ ఇి అసలు ఐసీసీ ఈవెంటలా లేదన్నాడు. మైదానంలో 'దిల్.. దిల్.. పాకిస్తాన్' అనే పాక్ సపోర్ట్ పాట కూడా చాలా తక్కువ సార్లు వేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇప్పుడు ఇదే విషయాన్ని ఎత్తి చూపిస్తున్న ఫ్యాన్స్.. ఇంగ్లండ్ ఓటమికి కూడా ఇదే కారణం అంటున్నారు. మైదానంలో 'దిల్.. దిల్.. ఇంగ్లండ్' పాట వేయలేదని, అందుకే ఇంగ్లండ్ ఓడిపోయిందని ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైనా ఇంగ్లండ్, ఆఫ్ఘన్ మ్యాచు ఫలితాన్ని చూపించి, పాకిస్తాన్‌ను ట్రోల్ చేయడం చూసిన చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

Story first published: Monday, October 16, 2023, 9:58 [IST]
Other articles published on Oct 16, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+