Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Shubman Gill: గిల్‌ దెబ్బకు భయపడిపోతున్న బాబర్.. ఆడుకుంటున్న ఫ్యాన్స్..!

పాకిస్తాన్‌ కెప్టెన్, వన్డే నెంబర్ వన్ బ్యాటర్ బాబర్ ఆజమ్‌ని ఫ్యాన్స్ ఓ ఆట ఆడుకుంటున్నారు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ని చూసి బాబర్ భయపడిపోతున్నాడంటూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. బంగ్లాదేశ్‌పై గిల్ హాఫ్ సెంచరీ బాదిన తర్వాత ఈ ట్రోల్స్ మరింత ఎక్కువయ్యాయి. వరల్డ్ కప్ ముందు డెంగ్యూ బారిన పడిన గిల్.. భారత్ ఆడిన తొలి రెండు మ్యాచులు ఆడలేదన్న సంగతి తెలిసిందే.

ఇక బాబర్ ఆజమ్ ఈ టోర్నీలో పెద్దగా రాణించలేదు. కేవలం భారత్‌తో జరిగిన మ్యాచులో మాత్రమే హాఫ్ సెంచరీ బాదాడు. మిగతా మ్యాచుల్లో చాలా పేలవమైన ఆటతీరు కనబరిచాడు. ఈ క్రమంలోనే అతనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు తొలి రెండు మ్యాచులు మిస్సయిన గిల్.. తను ఆడిన రెండో వరల్డ్ కప్ మ్యాచులోనే హాఫ్ సెంచరీ బాదడంతో నెటిజన్లు రెచ్చిపోయారు.

World Cup 2023 Fans troll Pak captain Babar Azam as Shubman Gill shines

బాబర్‌ను, అతని వన్డే నెంబర్ వన్ బ్యాటర్ ర్యాంకును టార్గెట్ చేస్తూ తెగ ట్రోలింగ్ మొదలు పెట్టారు. భారత్‌ వర్సెస్ బంగ్లాదేశ్‌ వరల్డ్ కప్ ‌మ్యాచ్‌లో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (103) సెంచరీతో అదరగొట్టగా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (53) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఇది గిల్‌కి తొలి వరల్డ్ కప్‌ హాఫ్ సెంచరీ కూడా. ఇక గిల్ హాఫ్ సెంచరీ చేయడంతో వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంకుకు మరింత చేరువయ్యాడు.

ఒకపక్క వరల్డ్ కప్‌లో మెయిడెన్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన గిల్‌ను అభినందిస్తూనే.. మరోపక్క వరుసగా విఫలమవుతున్న బాబర్‌పై నెటిజన్లు మీమ్‌లతో రెచ్చిపోతున్నారు. ఎక్స్ వేదికగా ఓ నెటిజన్.. టెన్షన్‌లో ఉన్న బాబర్ ఫోటోపై 'ఇక నా నెంబర్ వన్ వన్డే బ్యాటర్ ర్యాంకు ఎన్నాళ్లుంటుందో..' అని రాసి పోస్ట్ చేశాడు. మరో యూజర్ అయితే.. పిచ్‌పై పడుకుని ఉన్న బాబర్ ఫోటోను షేర్ చేసి 'నా నెంబర్ వన్ ర్యాంకు త్వరలో పోగొట్టుకోబోతున్నానన్నమాట..' అనే కామెంట్‌ను యాడ్ చేశాడు.

ఇదిలా ఉంటే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం బాబర్ అజామ్ 836 పాయింట్లతో నెంబర్ వన్ ర్యాంకులో ఉన్నాడు. ఆ తర్వాత స్థానంలో 818 పాయింట్లతో శుభ్‌మన్ గిల్ రెండో స్థానంలో ఉన్నాడు. అంటే బాబర్ కన్నా సరిగ్గా 16 పాయింట్లు తక్కవన్నమాట. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ముందు గిల్ పాయింట్లు 816 మాత్రమే. అయితే బంగ్లాపై హాఫ్ సెంచరీతో ఇది రెండు పాయింట్లు పెరిగింది. ఇలాగే ఈ వరల్డ్ కప్ టోర్నీలో గిల్ రాణిస్తే బాబర్ ర్యాంకు తర్వలో పోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Story first published: Friday, October 20, 2023, 13:08 [IST]
Other articles published on Oct 20, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+