Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World cup 2023 సెంచరీల విలన్ పాండ్యా.. ఒక్క సిక్స్‌తో రాహుల్ కొంప ముంచాడుగా!

వరల్డ్ కప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ అద్భుతమైన విజయం సాధించింది. 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచిన టీమిండియాని రన్ మెషీన్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ కలిసి ముందుకు నడిపించారు. ఇద్దరూ కలిసి 165 రన్స్ పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పి భారత్‌కు విజయాన్నందించారు.

85 రన్స్ చేసిన విరాట్ కోహ్లీ.. 38వ ఓవర్లో అవుట్ కాగా హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌కి వచ్చాడు. కోహ్లీ సెంచరీ మిస్ కావడంతో ఫ్యాన్స్ కొద్దిగా నిరాశకు గురైనా.. అప్పటికే కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దిన కేఎల్ రాహుల్ 75 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉండడంతో కచ్చితంగా సెంచరీ చేస్తాడని అంతా అనుకున్నారు.

 Hardik Pandya

కానీ రాహుల్ సెంచరీకి 7 పరుగుల దూరంలో ఉన్న సమయంలో జట్టు విజయానికి కేవలం 5 పరుగులు మాత్రమే కావాలి. అలాంటి టైంలో ముందుగా ఓ ఫోర్, తర్వాత సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకుందాం అనుకున్నాడు రాహుల్. కానీ కమిన్స్ వేసిన బంతిని బలంగా కొట్టడంతో అది బౌండరీ దాటేసింది. దీంతో రాహుల్ కూడా కొద్దిగా షాక్ అయ్యాడు. ఏది ఏమైనా 97 రన్స్ చేసిన రాహుల్ సెంచరీని కొద్దిలో మిస్ అయింది.

ఇక కేఎల్ రాహుల్ సెంచరీ మిస్ కావడంతో నిరాశకు గురైన ఫ్యాన్స్ హార్దిక్ పాండ్యాను ట్రోల్ చేస్తున్నారు. ఇన్నింగ్స్ 40వ ఓవర్లో హార్దిక్ కొట్టిన సిక్స్ సిక్స్ వల్లే రాహుల్ సెంచరీ మిస్ అయిందని ట్రోల్ చేస్తున్నారు. అప్పటికే తక్కువగా ఉన్న టార్గెట్ హార్దిక్ సిక్స్‌తో మరింత తగ్గిపోయిందని, ఒకవేళ ఆ సిక్స్ కొట్టకుండా ఉండి ఉంటే రాహుల్ సెంచరీ పూర్తయ్యేదనేది ఫ్యాన్స్ వాదన.

ఇది మాత్రమే కాకుండా హార్దిక్‌ను సెంచరీల విలన్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇంతకుముందు వెస్టిండీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో కూడా తిలక్ వర్మ 49 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్నప్పుడు సింగిల్ తీయకుండా సిక్స్ కొట్టి మ్యాచ్‌ను గెలిపించాడు హార్దిక్. దీంతో తిలక్ హాఫ్ సెంచరీ మిస్ అయింది. అప్పట్లో హార్దిక్‌పై విపరీతంగా విమర్శలు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు రాహుల్ విషయంలో కూడా అదే తరహాలో సిక్స్ కొట్టి హార్దిక్ మళ్లీ విమర్శలపాలవుతున్నాడు.

Story first published: Monday, October 9, 2023, 15:43 [IST]
Other articles published on Oct 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+