Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ENGvsNZ: బట్లర్ మాటల వెనుక మీనింగ్ ఇదా?.. ఇంగ్లండ్ ఓటమిపై పేలుతున్న జోకులు!

డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో వరల్డ్ కప్ లో అడుగు పెట్టిన ఇంగ్లండ్ జట్టు.. ఈసారి ఈ మెగాటోర్నీని చాలా దారుణంగా మొదలు పెట్టింది. న్యూజిల్యాండ్ తో జరిగిన వరల్డ్ కప్ ఓపెనర్ మ్యాచులో చిత్తు చిత్తుగా ఓడింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచులో టాస్ గెలిచిన కివీస్ తాత్కాలిక సారధి టామ్ లాథమ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ ఆలోచన అద్భుతంగా పని చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్ (77) మినహా ఎవరూ క్రీజులో సరిగా కుదురుకోలేకపోయారు. ఈ క్రమంలో ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 282 పరుగులు మాత్రమే చేసింది.

World Cup 2023 Fans troll England miserable defeat

ఈ లక్ష్యాన్ని ఛేదించడం న్యూజిల్యాండ్ కు కష్టమే అని అంతా అనుకున్నారు. బలమైన ఇంగ్లండ్ బౌలింగ్ విభాగం కూడా ఈ పిచ్ పై రాణిస్తుందని, న్యూజిల్యాండ్ గట్టిగా పోరాడాలని అనుకున్నారు. కానీ అలా ఏం జరగలేదు. కివీ ఓపెనర్ డెవాన్ కాన్వే (151 నాటౌట్), కొత్త కుర్రాడు రచిన్ రవీంద్ర (123 నాటౌట్) ఇద్దరూ చెలరేగారు.

ఇంగ్లండ్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. దీంతో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయిన కివీస్ 36.2 ఓవర్లలోనే మరో 82 బంతులు మిగిలుండగానే తొమ్మిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇది చూసిన ఫ్యాన్స్ తెగ నవ్వుకుంటున్నారు. వన్డేల్లో కూడా బాజ్ బాల్ తరహా బ్యాటింగ్ చేస్తామని చెప్పుకునే ఇంగ్లండ్ తిక్క కుదిరిందని అంటున్నారు.

ఇంత ఘోరంగా ఓడిపోవడంతో ఇంగ్లండ్ నెట్ రన్ రేట్ చాలా దారుణంగా దెబ్బతింది. దీన్నే ఎత్తి చూపిన కొందరు ఫ్యాన్స్.. ఇలాగైతే డిఫెండింగ్ ఛాంపియన్లు తమ టైటిల్ కోల్పోతారని అంటున్నారు. మరికొందరేమో బట్లర్ మాటలు గుర్తుచేస్తూ.. ఇంగ్లండ్ ఏమీ డిఫెండ్ చేసుకోదు అంటే ఏదో అనుకున్నా ఇలా తమ స్కోరును డిఫెండ్ చేసుకోదన్నమాట అంటూ జోకులు పేలుస్తున్నారు.

Story first published: Friday, October 6, 2023, 8:41 [IST]
Other articles published on Oct 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+