వన్డే వరల్డ్ కప్‌లో సంచలనం నమోదైంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను ఆఫ్ఘనిస్తాన్ చిత్తు చేసింది. ఏకంగా 69 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ అద్భుతంగా ఆడింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న రహ్మనుల్లా గుర్బాజ్ (80) టీ20 తరహా బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.
అతనితోపాటు ఇబ్రహీం జద్రాన్ (28) కూడా ఫర్వాలేదనిపించాడు. అయితే వన్ డౌన్‌లో వచ్చిన రహ్మత్ షా (3), కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ (14), అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (19) రాణించలేదు. అయితే తన తొలి మ్యాచ్ ఆడుతున్న ఇక్రమ్ అలిఖిల్ (58) చూడచక్కని ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో రషీద్ ఖాన్ (23), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (28) కూడా ఫర్వాలేదనిపించారు.

దీంతో ఆ జట్టు 49.5 ఓవర్లలో 284 పరుగులు ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ తేలిపోయింది. ఒక్క హ్యారీ బ్రూక్ (66) మినహా అందరూ విఫలమయ్యారు. దీంతో ఈ లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఛేజ్ చేయలేకపోయింది. చివర్లు 40.3 ఓవర్లలో 215 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. ముజీబ్ ఉర్ రెహ్మాన్ వరుసగా మూడు వికెట్లు కూడా తీసుకున్నాడు.
పిచ్ నుంచి స్పిన్నర్లకు కొంత సహకారం లభించడంతో ముజీబ్ రెచ్చిపోయాడు. అతనితోపాటు రషీద్ ఖాన్ కూడా మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఇలా ఇంగ్లండ్ తేలిపోవడం చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇంగ్లండ్ ఆటగాళ్లు బాజ్‌బాల్ ఆడే ముందు బ్యాటింగ్ ఎలా చేయాలో పిక్‌ను బట్టి అందరూ ఇంగ్లండ్‌ను తెగ ట్రోల్ చేస్తున్నారు.
ఇంగ్లండ్ బ్యాటర్లు కనీసం ఆటతీరు కనబరచలేరని, ఆఫ్ఘన్ స్పిన్నర్లు చెలరేగారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అందుకే అందరూ కూడా ఇంగ్లండ్‌ను ట్రోల్ చేస్తున్నారు. గత వరల్డ్ కప్‌లో ఆఫ్ఘన్‌ను ఇంగ్లండ్ చిత్తు చేసింది. ఇప్పుడు ఆఫ్ఘన్ దానికి పగ తీర్చకుందని మరికొందరు వాదిస్తున్నారు.