వరల్డ్ కప్ ముందు అన్ని జట్లు వార్మప్ మ్యాచులు ఆడుతున్న సంగతి తెలిసిందే. వీటిని చూసేందుకు కూడా ఫ్యాన్స్ తెగ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా టీమిండియా వంటి జట్లు ఆడుతున్న మ్యాచులకు తెగ క్రేజ్ ఉంది. అయితే ఈ మెగా టోర్నీకి ముందు భారత్ ఆడుతున్న తొలి వార్మప్ మ్యాచ్ వర్షార్పణమైంది. గువాహతిలోని బర్సాపరా స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగాల్సింది.
వరల్డ్ కప్ డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను ఈ వార్మప్ మ్యాచులో ఢీకొట్టేందుకు భారత్ రెడీ అయింది. కానీ ఈ మ్యాచ్ టాస్ మాత్రమే జరిగింది. ఆ తర్వాత వర్షం ఆగకపోవడంతో మ్యాచ్ రద్దయింది. రోహిత్ శర్మ ఈ మ్యాచులో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తమ టీంలో అందరికీ బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వాలనే ఆలోచనతోనే హిట్‌మ్యాన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

ఫ్యాన్స్ కూడా వరల్డ్ కప్‌లో టీమిండియా ఇదే రేంజ్‌లో రాణిస్తుందో చూడాలని అనుకున్నారు. ఈ మ్యాచ్ వర్షార్పణం అవడంతో వారి ఆశలన్నీ ఆవిరయ్యాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా బీసీసీఐపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అసలు ఏ ఆలోచనతో వాతావరణ అలర్ట్‌లతో సంబంధం లేకుండా మ్యాచులు నిర్వహిస్తున్నారని నిలదీస్తున్నారు. ఇలా తమ ఫీలింగ్స్‌తో ఆటలాడుకోవడం కరెక్ట్ కాదని అంటున్నారు.
కొన్నిరోజుల క్రితం ఆసియా కప్‌లో కూడా చాలా వరకు మ్యాచులకు వర్షం అంతరాయం కలిగించిన సంగతి తెలిసిందే. గ్రూప్ దశలో భారత్, పాక్ మ్యాచు కూడా వర్షం వల్ల ఆగిపోయింది. ఆ టోర్నీ అంతా దాదాపు అన్ని మ్యాచులకు వర్షం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో మరోసారి ఫ్యాన్స్ అందరూ బీసీసీఐ సెక్రటరీ జై షాను టార్గెట్ చేస్తున్నారు.
అసలు మీరు క్రికెట్ మ్యాచులు షెడ్యూల్ చేస్తున్నారా? లేక స్విమ్మింగ్ మ్యాచులు షెడ్యూల్ చేస్తున్నారా? అంటూ మండిపడుతున్నారు. అలాగే జై షా ఫొటోలపై కామెంట్స్ చేస్తూ జోకులు పేలుస్తున్నారు. ఇలాగైతే వరల్డ్ కప్‌లో కూడా వర్షం ఎక్కువగా ఆడుతుందేమో? అంటున్నారు.