పాకిస్తాన్ క్రికెట్ టీం కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు పోలీసులు ఫైన్ వేశారు. పాక్‌లోని పంజాబ్ మోటార్‌వేలో తన ఆడి కారులో పరిమితికి మించిన వేగంతో బాబర్ డ్రైవ్ చేశాడు. ఈ సమయంలో అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఆ కారును ఆపారు. డ్రైవింగ్ చేస్తున్న బాబర్‌కు ఫైన్ వేశారు. అయితే అతనికి ఎంత ఫైన్ వేసిందీ తెలియ రాలేదు.
అయితే ఇలా ట్రాఫిక్ పోలీసులకు చిక్కడం బాబర్‌కు ఇదేం కొత్త కాదు. గతంలో తన కారుకు సరైన నెంబర్ ప్లేటు లేకుండా బాబర్ డ్రైవ్ చేస్తూ దొరికిపోయాడు. ఆ సమయంలో బాబర్‌కు పోలీసులు ఎలాంటి ఫైన్ వేయలేదు. సరైన నెంబర్ ప్లేటు పెట్టుకోవాలని చెప్పి పంపేశారు. కానీ ఈసారి మాత్రం ఓవర్‌స్పీడ్‌గా వెళ్తున్నందుకు అతనికి ఫైన్ వేశారు.

ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్.. ఈ ఘటనపై జోకులు పేలుస్తున్నారు. వరల్డ్ కప్ కోసం భారత్‌కు పాకిస్తాన్ టీం రావల్సి ఉన్న సంగతి తెలిసిందే. దీని కన్నా ముందు టీం అంతా కలిసి దుబాయ్ వెళ్లి సరదాగా గడపాలని అనుకున్నారు. పీసీబీ దీనికి ఏర్పాట్లు కూడా చేసింది. కానీ భారత్ నుంచి టీంకు రావలసిన వీసా ఆలస్యం కావడంతో ఈ ట్రిప్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది.
భారత్ వీసా ఆలస్యం అయిందని కారులో వచ్చేయాలని అనుకున్నాడేమో? అని జోకులు వేస్తున్నారు. ఇంకొందరేమో బాబర్ కారు వేగంగా డ్రైవ్ చేస్తాడని, కానీ బ్యాటింగ్‌లో ఇన్నింగ్స్ మాత్రం పరమ స్లోగా చేస్తాడని వెటకారం ఆడుతున్నారు. మరికొందరేమో పీసీబీ నుంచి రావలసిన జీతం నాలుగు నెలలుగా బాబర్‌కు రాలేదని, ఇప్పుడు ఈ చలానా ఎలా కడతాడని జోక్ చేస్తున్నారు.
ఏదేమైనా ఇలా బాబర్‌కు ఫైన్ వేయడం నెట్టింట పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. కాగా, భారత్ వీసాల కోసం పీసీబీ సెప్టెంబరు 19న దరఖాస్తులు చేసింది. అయితే వీసాలు రావడానికి కనీసం ఐదు రోజులు పడుతుంది. దీంతో ఆ టీం దుబాయ్ ట్రిప్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. మొత్తానికి వీసాలు అందడంతో బుధవారం నాడు భారత్‌కు వచ్చేందుకు ఆ టీం రెడీ అయింది. ఇదే విషయాన్ని గుర్తు చేస్తున్న ఫ్యాన్స్.. బాబర్‌ను ట్రోల్ చేస్తున్నారు.