Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Babar Azam: మళ్లీ ఫెయిలైన బాబర్.. జింబాబ్వే సిరీస్ కావాలా? అంటూ ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్!

వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ చెత్త ఫామ్ కొనసాగుతోంది. వామప్ మ్యాచుల్లో బ్యాటుతో చెలరేగిన ఈ పాకిస్తాన్ స్టార్.. అసలు మ్యాచులు మొదలవగానే చతికిలపడ్డాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన తొలి వరల్డ్ కప్ మ్యాచులో కూడా బాబర్ విఫలమయ్యాడు. పసికూనపై కూడా ప్రతాపం చూపించలేక కేవలం 5 పరుగులకే అవుటయ్యాడు.

ఇక శ్రీలంకపై కూడా బాబర్ తెల్లమొఖం వేశాడు. బ్యాటింగ్‌కు సహకరించే హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక గట్టిగా పోరాడింది. కుశాల్ మెండిస్ (122), సదీర సమరవిక్రమ్ (106) సెంచరీలతో మెరిశారు. దీంతో శ్రీలంక జట్టు ఏకంగా 344 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్ నోరెళ్లబెట్టారు.

World cup 2023 Fans troll Babar Azam after he fails against Sri Lanka

ఎందుకంటే ఇటీవలి కాలంలో వరకు శ్రీలంక బ్యాటర్లు ఇలా ధనాధన్ ఇన్నింగ్సులు ఆడింది లేదు. మిగతా బ్యాటర్లు కూడా పెద్దగా ఆడలేదు. అయితే వీళ్లిద్దరి ఆట చూసిన ఫ్యాన్స్ మాత్రం బలమైన బ్యాటింగ్ ఉన్న పాకిస్తాన్ కూడా ఈ మ్యాచులో చెలరేగుతుందని, శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపిస్తుందని అనుకున్నారు. కానీ పాక్ ఛేజింగ్ మొదలవగానే ఈ అంచనాలు తలకిందులయ్యాయి.

భారీ లక్ష్య ఛేదనలో పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (12) పెద్దగా పరుగులు చేయకుండానే పెవిలియన్ చేరాడు. దీంతో క్రీజులోకి వచ్చిన బాబర్ ఆజమ్ (10) మరోసారి విఫలమయ్యాడు. మధుష్క వేసిన చాలా పూర్ డెలివరీని ఆడబోయిన బాబర్ వికెట్ పారేసుకున్నాడు. లెగ్ సైడ్ వచ్చిన బంతిని గ్లాన్స్ చేసేందుకు బాబర్ ట్రై చేశాడు. అయితే ఇది నేరుగా సదీర్ సమరవిక్రమ వైపు వెళ్లింది.

దాన్ని అతను ఎలాంటి పొరపాటు చేయకుండా పట్టేశాడు. దీంతో బాబర్ నిరాశగా తల వంచుకొని మైదానం వీడాడు. ఇది చూసిన ఫ్యాన్స్ మరోసారి బాబర్‌పై మండిపడుతున్నారు. 'పసికూనలపై అయితే ప్రతాపం చూపిస్తావు. కనీసం శ్రీలంకపై ఆడలేవా?' అంటూ మండిపడుతున్నారు. మరికొందరేమో బాబర్ ఫామ్ అందుకోవాలంటే అర్జెంటుగా జింబాబ్వేతో సిరీస్ పెట్టాలని జోకులు పేలుస్తున్నారు. మరి మిగతా మ్యాచుల్లో అయినా బాబర్ రాణిస్తాడేమో చూడాలి.

Story first published: Tuesday, October 10, 2023, 20:30 [IST]
Other articles published on Oct 10, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+