Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: మేం మర్చిపోలా.. నవీన్‌కు చుక్కలు చూపించిన కోహ్లీ ఫ్యాన్స్!

ప్రపంచంలో అత్యంత ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్ ఎవరు? అంటే చటుక్కున గుర్తొచ్చే పేరు విరాట్ కోహ్లీ. ఈ టీమిండియా స్టార్‌కు ఉన్నంత ఫాలోయింగ్ మరెవరికీ లేదనే చెప్పాలి. కేవలం భారత్‌లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కోహ్లీకి ఫాలోవర్లు ఉన్నారు. అలాంటి వాడితో ఉట్టిపుణ్యానికి గొడవ పెట్టుకోవడం కరెక్ట్ కాదు కదా.

కానీ ఐపీఎల్ సమయంలో ఆఫ్ఘన్ కుర్ర ప్లేయర్ నవీన్ ఉల్ హక్ అదే పని చేశాడు. కోహ్లీతో పెద్ద గొడవకు దిగాడు. అతని చేతిని విదిలించి కొట్టాడు. దీంతో నవీన్ ఆడుతున్న లక్నో టీంకు మెంటార్‌గా ఉన్న గౌతం గంభీర్ కూడా మధ్యలో రావలసి వచ్చింది. దీంతో ఈ గొడవ మరింత పెద్దదైంది. ఈ ఇష్యూ చల్లారిన తర్వాత సోషల్ మీడియాలో కూడా నవీన్ ఎక్స్‌ట్రాలు చేశాడు.

World Cup 2023 Fans tease Naveen Ul Haq with Kohli chants in Dharmashala

ఈ గొడవ సోషల్ మీడియాలో కూడా నవీన్ ఎక్స్‌ట్రాలు పోయాడు. దీన్ని ఎవరు మర్చిపోయినా ఫ్యాన్స్ మర్చిపోరు కదా. అందుకే వరల్డ్ కప్‌లో కూడా అతన్ని ఒక ఆట ఆడుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మ్యాచులో బౌండరీ లైన్ వద్ద నవీన్ ఫీల్డింగ్ చేయడానికి వచ్చాడు. అతను కనిపించగానే స్టాండ్స్‌లో ఉన్న ఫ్యాన్స్ రెచ్చిపోయారు.

'కోహ్లీ.. కోహ్లీ..' అంటూ నినాదాలు చేశారు. బంగ్లాతో ధర్మశాల వేదికగా ఆఫ్ఘన్ తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచులోనే ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నవీన్‌ను కోహ్లీ ఫ్యాన్స్ ఒక ఆట ఆడుకున్నారంటూ చాలా మంది ప్రేక్షకులు ఈ వీడియోను నెట్టింట షేర్ చేస్తున్నారు.

ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడినప్పుడు ఏం జరుగుతుందని కొందరు ఆశ్చర్యపోతున్నారు. ఆ మ్యాచులో కనుక నవీన్‌ను కోహ్లీ టార్గెట్ చేసి, అతని బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడితే ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోతుందని చెప్పుకుంటున్నారు.

Story first published: Sunday, October 8, 2023, 9:23 [IST]
Other articles published on Oct 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+