Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsBAN: కోహ్లీ అదృష్టం.. అవతలి ఎండ్‌లో పాండ్యా లేడు.. సెంచరీ చచ్చినా అయ్యేది కాదు!

ICC ODI Wolrd Cup 2023: ఇండియా vs బంగ్లాదేశ్: వరల్డ్ కప్‌లో ఎట్టకేలకు కోహ్లీ సెంచరీ చేశాడు. గత వరల్డ్ కప్‌లో ఒక్క శతకం కూడా నమోదు చేయలేకపోయిన అతను.. ఈ వరల్డ్ కప్‌ను ఘనంగానే ఆరంభించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ త్రుటిలో ఆ ఛాన్స్ మిస్సయింది. అయితే ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచుల్లో కోహ్లీకి సెంచరీ చేసుకునే అవకాశం రాలేదు.

ఇలాంటి సమయంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో కోహ్లీ ముందు అవకాశం కనిపించింది. దానికితోడు అవతలి ఎండ్‌లో కేఎల్ రాహుల్ (34 నాటౌట్) ఉన్నాడు. అతని హాఫ్ సెంచరీ పూర్తవ్వాలంటే 15 పరుగులు కావాలి. అదే సమయంలో కోహ్లీ సెంచరీ పూర్తవ్వాలన్నా 15 పరుగులే కావాలి. జట్టు విజయం సాధించాలన్నా 15 పరుగులు చేస్తే చాలు.

World Cup 2023 Fans target Hardik Pandya as KL Rahul lets Virat Kohli complete his hundred

ఇలాంటి సమయంలో కోహ్లీ సింగిల్స్ తీయాలని కోరినా రాహుల్ నిరాకరించాడు. ఎటూ గెలిచే పొజిషన్‌లో ఉన్నప్పుడు టెన్షన్ ఎందుకు? నీ సెంచరీ పూర్తి చేసుకో అని చెప్పాడట. వ్యక్తిగత రికార్డుల కోసం ఆడుతున్నాడని ఫ్యాన్స్ మళ్లీ తిడతారని కోహ్లీ కొంత టెన్షన్ పడ్డాడట. కానీ ఏం పర్లేదు సెంచరీ చేసుకో అని చెప్పిన రాహుల్.. డబుల్స్ తీశాడు కానీ, సింగిల్స్ మాత్రం నిరాకరించాడు.

ఇది చూసిన ఫ్యాన్స్.. రాహుల్ మంచి మనసు చూసి ముచ్చటపడుతున్నారు. అప్పుడెప్పుడో ధోనీ ఇలా చేయడం చూశామని, మళ్లీ ఇప్పుడే అది కనిపిస్తోందని అంటున్నారు. అదే సమయంలో మరికొందరేమో హార్దిక్ పాండ్యాపై ట్రోలింగ్ మొదలు పెట్టారు. అవతలి ఎండ్‌లో రాహుల్ ఉన్నాడు కాబట్టి కోహ్లీ సెంచరీ అయింది. అదే పాండ్యా ఉండి ఉంటే అంతే సంగతులంటూ జోకులు వేస్తున్నారు.

విండీస్‌తో జరిగిన టీ20 సిరీసులో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (49 నాటౌట్)గా ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన పాండ్యా.. భారీ షాట్లు ఆడేసి మ్యాచ్ ముగించేశాడు. అప్పటికే గెలుపు ఖాయమైనా తిలక్‌ను హాఫ్ సెంచరీ చేసుకోనివ్వలేదు. అలాగే ఈ వరల్డ్ కప్ మొదటి మ్యాచులో ఆసీస్‌పై రాహుల్ శతకం చేసుకోవాల్సింది. కానీ క్రీజులోకి వచ్చీరావడంతోనే పాండ్యా ఒక భారీ సిక్సర్ బాదాడు.

దీంతో గణాంకాలు పూర్తిగా మారిపోయాయి. రాహుల్ సెంచరీ చేయాలంటే ఒక ఫోర్, ఒక సిక్సర్ కొట్టాల్సి వచ్చింది. కానీ సిక్సర్ కొడితే భారత్ విజయం పూర్తవుతుంది. ఈ సమయంలో రాహుల్ ఫోర్ కోసం ట్రై చేసినా అది సిక్సర్ వెళ్లింది. అప్పుడు కూడా పాండ్యా సిక్సర్ బాదకపోయి ఉంటే రాహుల్ శతకం చేసుకునేవాడే. అందుకే ఇప్పుడు అందరూ కూడా పాండ్యాను టార్గెట్ చేస్తూ నెట్టింట జోకులు పేలుస్తున్నారు.

Story first published: Friday, October 20, 2023, 9:11 [IST]
Other articles published on Oct 20, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+