For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

World Cup 2023: వరల్డ్ కప్‌లో ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే సీన్స్.. ఇంత షాకిచ్చావేంటి కోహ్లీ?

వరల్డ్ కప్‌ 2023లో తొలిసారి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌ను దారుణంగా నిరాశపరిచాడు. ఇప్పటివరకు టోర్నీలో అద్భుతంగా ఆడుతున్న కోహ్లీ.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న అత్యంత కీలక పోరులో 9 బంతులాడి ఖాతా తెరవకుండానే డకౌట్‌గా వెనుతిరిగాడు.

అక్టోబర్ 28, 29.. ఈ రెండు తేదీలు క్రికెట్ ఫ్యాన్స్‌కు భారీ షాకిచ్చాయి. ఎందుకంటే వరల్డ్ కప్ లో 29వ తేదీన ఇంగ్లండ్‌ తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ డకౌటయ్యాడు. డేవిడ్ విల్లీ వేసిన ఇన్నింగ్స్ 7వ ఓవర్లో మిడాన్ వైపు షాట్ ఆడబోయిన కోహ్లీ.. అక్కడ స్టోక్స్‌కు సింపుల్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ టోర్నీలో విరాట్ డకౌట్ కావడం ఇదే తొలిసారి. గిల్ అవుట్‌నే జీర్ణించుకోలేకపోయిన ఫ్యాన్స్.. ఇలా కోహ్లీ ఏకంగా డకౌట్ అవడంతో షాకైపోయారు.

World Cup 2023 Fans shocked to see Virat Kohli first duck out in World Cups

దీనికి సరిగ్గా ఒక్కరోజు ముందు అంటే 28వ తేదీన కూడా ఫ్యాన్స్‌కు ఇలాంటి షాకే తగిలింది. స్టార్ ఆటగాడు.. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ కూడా ఫ్యాన్స్‌కు ఇచ్చాడీ షాక్. న్యూజిల్యాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 ఓవర్లు వేసిన స్టార్క్.. 9.88 ఎకానమీతో 89 రన్స్ ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇప్పటివరకు స్టార్క్ ఇలా వరల్డ్ కప్ మ్యాచ్ లో ఒక్క వికెట్ కూడా తీయకపోవడం ఇదే తొలిసారి.

టోర్నీలో అద్భుతంగా ఆడుతూ.. ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెడుతున్న ఇద్దరు స్టార్ ఆటగాళ్లు ఇలా వరుస రోజుల్లో ఇలా ఫెయిల్యూర్స్ నమోదు చేయడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతూ.. తమ బాధను వెళ్లగక్కుతున్నారు.

కోహ్లీ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచుల్లో ఆస్ట్రేలియాపై 85, ఆఫ్ఘనిస్తాన్‌పై 55*, పాకిస్తాన్‌పై 16, బంగ్లాదేశ్‌పై 103*, న్యూజిల్యాండ్‌పై 95 పరుగులు చేసి ఫుల్ ఫాంలో కనిపించాడు. అలాగే స్టార్క్ కూడా తొలి మ్యాచ్‌లో ఇండియాపై 1 వికెట్, సౌతాఫ్రికాపై 2 వికెట్లు, శ్రీలంకపై 2 వికెట్లు, పాకిస్తాన్‌పై 1 వికెట్, నెదర్లాండ్స్‌పై 1 వికెట్ తీసుకున్నాడు. అయితే న్యూజిల్యాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఒక్క వికెట్ తీయలేకపోయాడు.

Story first published: Sunday, October 29, 2023, 17:12 [IST]
Other articles published on Oct 29, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+