Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsNZ: ఇలా మ్యాచ్ ఆగిపోతుందని ఎవరూ ఊహించలేదు.. షాకైపోయిన ఫ్యాన్స్!

క్రికెట్‌లో రకరకాల కారణాల వల్ల మ్యాచులు ఆగిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఒక్కోసారి వాతావరణం బాగలేక, వర్షం వల్ల, లైటింగ్ సరిగా లేదని, తుఫాను వచ్చిందని ఇలా ఎన్నో కారణాల వల్ల మ్యాచులు మధ్యలో ఆగిపోవాల్సి వచ్చింది. కొన్ని సార్లు దగ్గరలో పిడుగులు పడినా కూడా మ్యాచును మధ్యలో నిలిపివేసిన సంబదర్భాలు ఉన్నాయి.

ఇలా ఎన్నో కారణాలతో మ్యాచులు ఆగిపోవడం చూసిన ఫ్యాన్స్ కూడా ఆదివారం నాడు ఆశ్చర్యపోయారు. ధర్మశాల వేదికగా భారత్, న్యూజిల్యాండ్ మధ్య జరిగిన మ్యాచ్.. పొగ మంచు వల్ల ఆగిపోయింది. ఈ మ్యాచులో భారత జట్టు ఛేజింగ్ మొదలు పెట్టిన తర్వాత ఈ ఘటన జరిగింది. రోహిత్ (46), గిల్ (27) అప్పటికే అవుటైపోయారు.

World Cup 2023 Fans shocked to see fog delay the INDvsNZ match

విరాట్ కోహ్లీ (95), శ్రేయాస్ అయ్యర్ (35) స్కోరు బోర్డును ముందుకు నడిపిస్తున్నారు. ఇలాంటి సమయంలో సడెన్‌గా స్టేడియం మొత్తాన్ని పొగ మంచు కమ్మేసింది. ఫెర్గూసన్ వేసిన బంతి కనీసం అయ్యర్‌కు కనిపించలేదు. ఇలా బ్యాటర్లకు కనీసం బంతి కనిపించనంతగా మంచు కమ్మేయడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు.

ఈ మంచు క్లియర్ అయ్యే వరకు మ్యాచ్ మొదలవదని తేల్చి చెప్పారు. దీంతో ఫ్యాన్స టెన్షన్ పడ్డారు. అసలే చలికాలం, పైగా ధర్మశాల అంత ఈజీగా పొగమంచు పోతుందా? అని ఆందోళన చెందారు. అయితే కేవలం పది నిమిషాల్లోనే పొగ మంచు విడిపోయింది. ఇది చూసిన అంపైర్లు మైదానంలోకి వచ్చి ఒకసారి చెక్ చేశారు.

అంతా బాగానే ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. ఇక బ్యాటర్లు వచ్చి ఆట మొదలు పెట్టొచ్చని చెప్పారు. ఇది చూసిన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇలా పొగ మంచు కారణంగా మ్యాచ్ ఆగిపోవడం ఇదే తొలిసారి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

దీంతో ఈ విషయం నెట్టింట తెగ ట్రెండ్ అయింది. అయితే అలా ఆట మొదలైందో లేదో, తొలి బంతికే అయ్యర్ అవుటవడంతో ఫ్యాన్స్ మళ్లీ షాకైపోయారు. ఆ తర్వాత కోహ్లీ మరోసారి తనదైన స్టైల్‌లో రెచ్చిపోయాడు.

వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తూ రాహుల్‌తో మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. కాసేపటికే రాహుల్ అవుటైనా కూడా.. రవీంద్ర జడేజా (39 నాటౌట్)తో కలిసి కోహ్లీ మరో మంచి పార్టనర్‌షిప్ నెలకొల్పాడు. చివరకు కోహ్లీ అవుటైనా బౌండరీతో జడ్డూ మ్యాచ్ ముగించాడు.

Story first published: Monday, October 23, 2023, 11:17 [IST]
Other articles published on Oct 23, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+