వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా పరమ చెత్త ప్రదర్శన చేసింది. సౌతాఫ్రికా చేతిలో ఏకంగా 134 పరుగుల తేడాతో చిత్తయింది. ఇటీవలి కాలంలో ఆసీస్ ఇంత ఘోరంగా ఓడిపోవడం ఇదే తొలిసారి. ఇదంతా చూసిన ఫ్యాన్స్ .. ఆసీస్ ఓటమికి కారణం ఏంటో ఇట్టే చెప్పేస్తున్నారు. ఈ మ్యాచులో ఆసీస్ ఫీల్డింగ్ ఆశించినంత స్థాయిలో లేదని తేల్చిచెప్తున్నారు.
సఫారీ బ్యాటర్లలో సెంచరీ చేసిన క్వింటన్ డీకాక్ (109), ఎయిడె మార్క్రమ్ (56) ఇద్దరూ రాణించారు. అయితే వీళ్లిద్దరూ ఇచ్చిన క్యాచులను ఆసీస్ ఆటగాళ్లు నేలపాలు చేశారు. అంతుకుముందు భారత్‌తో మ్యాచులో కూడా విరాట్ కోహ్లీ ఇచ్చిన ఈజీ క్యాచును ఆసీస్ జారవిడిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కోహ్లీని అడ్డుకోలేకపోయిన ఆసీస్.. ఓటమి మూటగట్టుకుంది.

ఇక సఫారీ మ్యాచులో సౌతాఫ్రికా బ్యాటర్లు రాణించిన మాట వాస్తవమే. ఈ మ్యాచులో సఫారీ స్టార్ డేవిడ్ మిల్లర్ ఇచ్చిన క్యాచును మిచెట్ స్టార్క్ నేలపాలు చేశాడు. మిల్లర్ గాల్లోకి లేపిన బంతిని అందుకోలేకపోయాడు. అలాగే మార్కో యాన్సెన్ ఇచ్చిన క్యాచును కూడా ఆసీస్ పట్టుకోలేదు. ఈ క్యాచును మార్కస్ స్టొయినిస్ వదిలేశాడు.
అద్భుతమైన ఫీల్డింగ్‌కు మారుపేరుగా నిలిచే ఆసీస్ ఇలా ఫీల్డింగ్ మర్చిపోయినట్లు క్యాచులు వదిలేయడం ఫ్యాన్స్‌కు గట్టి షాకిచ్చింది.
అసలు భారత్‌తో జరిగిన మ్యాచులోనే ఇలా ఆసీస్ క్యాచు వదిలేయడం చూసి ఫ్యాన్స్ షాకయ్యారు. అలాంటిది సఫారీతో మ్యాచులో క్యాచులు వదిలేయడం, ఫ్యాన్స్ చేయలేకపోవడం చూసి నోరెళ్లబెట్టాడు.
వాళ్ల ఆట చూసి షాకయ్యామని అంటున్నారు. ఇటీవలి కాలంలో అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తున్న జట్లలో ఆసీస్ ఒకటనే సంగతి తెలిసిందే. అలాంటి ఆసీస్ కూడా ఇంత చెత్తగా ఆడటం చూసిన ఫ్యాన్స్ తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నారు. ఇది తమకు తెలిసిన ఆసీస్ జట్టేనా? అని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ఆసీస్ ఫీల్డింగ్ మెరుగవకపోతే ఆ తర్వాతి మ్యాచులోనూ ఓడిపోయే అవకాశం ఉందని అంటున్నారు. ఆసీస్ ఏం చేస్తుందో చూడాలి.