Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PAKvsAFG: వాళ్ల ఛేజ్ చూస్తే.. కోహ్లీ గుర్తొచ్చాడంటున్న ఫ్యాన్స్!

PAKvsAFG: ఆప్ఘనిస్తాన్ జట్టు వరల్డ్ క్‌లో చరిత్ర సృష్టించింది. మొట్టమొదటి సారి పాకిస్తాన్‌ను వన్డే మ్యాచులో చిత్తు చేసింది. 282 పరుగుల లక్ష్య ఛేదనను మరో ఓవర్ ముందే ముగించింది. ఈ మ్యాచులో ఆఫ్ఘన్ కేవలం రెండు వికెట్లే కోల్పోవడం గమనార్హం. పాకిస్తాన్ మాజీలు, ఫ్యాన్స్ అందరూ కూడా బౌలింగే తమ బలం అని చెప్తూ ఉండటం తెలిసిందే.

అలాంటి బౌలర్లు ఆఫ్ఘన్ బ్యాటర్ల పట్టుదల ముందు తేలిపోయారు. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ (65), ఇబ్రహీం జద్రాన్ (85) ఇద్దరూ ఛేజింగ్‌ను అద్భుతంగా మొదలు పెట్టారు. వీళ్లిద్దరూ అవుటైన తర్వాత రహ్మత్ షా (77 నాటౌట్), ఆఫ్ఘన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ (48 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూనే మ్యాచ్ ముగించారు.

 World Cup 2023 Fans reminded of Virat Kohli in PAKvsAFG chase

వీళ్లిద్దరూ మిడిల్ ఓవర్లలో చాలా నిదానంగా బ్యాటింగ్ చేశారు. కనీసం సింగిల్స్, డబుల్స్ కూడా తీయలేదు. ఇదంతా చూసిన చాలా మంది అభిమానులు.. ఇలాగైతే చివర్లో బ్యాటర్లపై ఒత్తిడి పెరిగిపోతుందని, ఆఫ్ఘన్ ఓడిపోతుందని అనుకున్నారు. కానీ చివరి పది ఓవర్లలో రహ్మత్, షాహిదీ జోడీ చెలరేగింది. అందుకని భారీ షాట్ల జోలికి కూడా వీళ్లిద్దరూ పోలేదు.

అచ్చం టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ మాదిరి వీలు చిక్కినప్పుడల్లా సింగిల్స్ తీస్తూ.. అవకాశం దొరికితే దాన్ని డబుల్‌గా మారుస్తూ పాకిస్తాన్ ఫీల్డర్లపై షా, షాహిదీ జోడీ ఒత్తిడి పెంచింది. అసలే ఓటమి భయంలో ఉన్న పాకిస్తాన్ ఫీల్డర్లు ఈ టెన్షన్ తట్టుకోలేకపోయారు. రెండు, మూడు సార్లు ఓవర్ త్రో విసిరి ఆప్ఘన్ జట్టుకు అదనపు పరుగులు సమకూర్చారు.

ఒకానొక దశలో వికెట్ల మధ్య షాహిదీ, షా పరిగెత్తడం చూస్తే కోహ్లీనే గుర్తొచ్చాడని ఫ్యాన్స్ అంటున్నారు. అంత వేగంగా రన్స్ తీశారీ ఈ ఇద్దరూ. షహీన్ అఫ్రిదీ, హసన్ అలీ, హారిస్ రవూఫ్ వంటి బౌలర్లను ఎంత మందిని మార్చినా కూడా బాబర్ ఆజమ్ మాత్రం వికెట్ తీయలేకపోయాడు. ఈ ఓటమితో వరల్డ్ కప్ సెమీస్ చేరడం పాకిస్తాన్‌కు మరింత కష్టంగా మారింది.

Story first published: Tuesday, October 24, 2023, 8:39 [IST]
Other articles published on Oct 24, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+