Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Devon Conway: ఐపీఎల్ మూడ్ పోలేదు కదా.. కాన్వే భారీ సెంచరీపై ఫ్యాన్స్ కామెంట్స్!

వరల్డ్ కప్ ఓపెనర్ మ్యాచులో న్యూజిల్యాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే చెలరేగాడు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గత వరల్డ్ కప్ ఫైనలిస్టులైన ఇంగ్లండ్, న్యూజిల్యాండ్ ఈ మ్యాచ్ లో తలపడ్డాయి. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఆశించినంత స్కోరు చేయలేకపోయింది.

కివీస్ బౌలర్లు చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్ బ్యాటర్లు తడబడ్డారు. దీంతో వాళ్లు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 282 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఈ లక్ష్య ఛేదనలో కివీస్ కు కూడా అనుకున్న ఆరంభం లభించలేదు. కుర్ర ఓపెనర్ విల్ యంగ్ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు.

World Cup 2023 Fans feel Devon Conway still stuck in IPL mood

ఇలాంటి సమయంలో డెవాన్ కాన్వేకు రచిన్ రవీంద్ర (123 నాటౌట్) జతకలిశాడు. వీళ్లిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. రవీంద్ర ధనాధన్ షాట్లు ఆడినా కూడా.. కాన్వే మాత్రం నెమ్మదిగా ఇన్నింగ్స్ నిర్మించేందుకు ప్రయత్నించాడు. ఒక్కసారి కుదురుకున్నట్లు అనిపించగానే ఎడాపెడా బౌండరీలు బాదేశాడు.

ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ కలిసి రెండో వికెట్ కు ఏకంగా 273 పరుగుల అభేద్యమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇది వరల్డ్ కప్ చరిత్రలోనే అతి పెద్ద పార్టనర్ షిప్ కావడం గమనార్హం. ఈ మ్యాచులో చెలరేగిన కాన్వే మొత్తం 121 బంతుల్లో 152 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్ చూసిన ఫ్యాన్స్ అంతా ఆశ్చర్యపోయారు.

Devon Conway New Zealand Team

కాన్వే ఇంకా ఐపీఎల్ మూడ్ నుంచి బయటకు రాలేదని, ఐపీఎల్ తరహాలోనే చెలరేగుతున్నాడని అంటున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కాన్వే అద్భుతంగా ఆడిన సంగతి తెలిసిందే. చెన్నై టీం ట్రోఫీ నెగ్గడంలో కాన్వే చాలా కీలక పాత్ర పోషించాడు. ఈ వరల్డ్ కప్ లో కాన్వే టాప్ స్కోరర్ గా నిలుస్తాడని జోస్యం చెప్తున్నారు.

Story first published: Friday, October 6, 2023, 8:06 [IST]
Other articles published on Oct 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+