Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsBAN: వాడు టీంలో ఉన్నా లేనట్లే.. టీంలో పది మందే ఉన్నారంటున్న ఫ్యాన్స్!

CWC23: Shardul Thakur : టీమిండియా ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ని ఫ్యాన్స్ ఓ ఆట ఆడుకుంటున్నారు. కొంతమంది అతడిని 2019లో టీమిండియాకు ఆడిన విజయ్ శంకర్‌తో పోలుస్తుంటే.. ఇంకొంతమంది అసలు శార్దూల్‌ని లెక్కలోకే తీసుకోవడం లేదు. సోషల్ మీడియా వేదికగా శార్దూల్‌ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

వరల్డ్ కప్‌లో టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య ఆసక్తికర పోరు జరుగుతోంది. పాకిస్తాన్‌తో ఆడిన జట్టుతోనే ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా బరిలోకి దిగింది. అయితే ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ స్థానంలో అశ్విన్‌ను కానీ, షమీని కానీ తీసుకుంటారని అంతా అనుకున్నా.. ఫైనల్ ఎలెవెన్‌లో శార్దూల్‌కే స్థానం దక్కింది. దీంతో ఫ్యాన్స్ టీమిండియాపై తెగ ఫైర్ అవుతున్నారు. అలాగే టీమిండియా నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

 World Cup 2023 Fans brutally trolling all rounder Shardul Thakur

శార్దూల్ తీసుకోవడంపై ఓ నెటిజన్.. 'ఈ భూమ్మీద అత్యంత పెద్ద మిస్టరీ ఏంటో తెలుసా..? ఫైనల్ ఎలెవెన్‌లో శార్దూల్ స్థానం దక్కించుకోవడమే. దాని మిస్టరీ ఎవ్వరికీ అర్థం కావడం లేదు. శార్దూల్ అసలు బ్యాటింగ్ చేయడు. బౌలింగ్ కూడా 2, 3 ఓవర్లు మాత్రమే వేస్తాడు. అలాంటప్పుడు అసలు జట్టులో ఎందుకుంటున్నాడో ఎవ్వరికీ అర్థం కాదు..' అని సెటైర్ వేశాడు.

మరో యూజర్.. 'శార్దూల్ ఠాకూర్ = విజయ్ శంకర్. టీమిండియా మేనేజ్‌మెంట్‌కి తమ బ్యాటర్లపై నమ్మకం లేదు. అందుకే బౌలర్లు బ్యాటింగ్ చేయాలని కోరుకుంటోంది. దానికోసం ఇన్‌ఫామ్ బౌలర్లను కూడా వదులుకుంటోంది. ఒకవేళ నాకౌట్ మ్యాచ్‌లలో బౌలింగ్ బాలేక ఓడిపోతే ఏం చేస్తారు..?' అని టీమిండియాను ప్రశ్నించాడు.

ఇంకొకరేమో.. '10 మంది ప్లేయర్లతో బరిలోకి దిగిన టీమిండియాకి కంగ్రాట్స్. అసలు జట్టులో శార్దూల్ ఉన్నా లేనట్లే. ఈ పిచ్‌పై షమీని తీసుకుంటే గొప్పగా బౌలింగ్ చేసేవాడు. కానీ శార్దూల్‌లో ఏదో స్పెషాలిటీ ఉన్నట్లు అతడిని తీసుకున్నారు. మరి ఈ మ్యాచ్‌‌లో అయినా ఆ స్పెషాలిటీ ఏమైనా చూపిస్తాడేమో చూద్దాం..' అంటూ శార్దూల్‌తో పాటు టీమిండియాని కూడా ట్రోల్ చేశాడు.

Story first published: Thursday, October 19, 2023, 17:49 [IST]
Other articles published on Oct 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+