క్రికెట్‌లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉండే అంత హైప్ మరే మ్యాచ్‌కూ ఉండదు. అదే వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీలో ఈ రెండు జట్లు తలపడితే? ఆ మజానే వేరు. ఈ ఏడాది అదే జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ రెండు టీమ్స్ తలపడనున్నాయి. అక్టోబర్ 15న జరిగే ఈ మ్యాచ్ చూడటం కోసం అభిమానులు అహ్మదాబాద్‌లో ఉన్న హెటల్స్ అన్నింట్లో రూమ్స్ బుక్ చేసేసుకుంటున్నారు.
దీంతో ఈ ఏరియాలో హోటల్ రూం చార్జీలు ఆకాశాన్నంటాయి. తాజా లెక్కల ప్రకారం ఇక్కడ ఒక్క రాత్రి హోటల్‌లో ఉండాలంటే రూ.50 వేలు ఖర్చవుతోంది. దీంతో భారత్, పాక్ మ్యాచ్ చూడటం మరీ ఖర్చుతో కూడుకున్న పనిగా మారింది. ఈ పరిస్థితిని అధిగమించడానికి క్రికెట్ ఫ్యాన్స్ ఒక కొత్త తరహా ఉపాయం ఆలోచించారు. ఈ మ్యాచ్ జరిగే సమయంలో అకామడేషన్ కోసం మొతేరా స్టేడియం చుట్టుపక్కల ఉన్న ఆస్పత్రులను సంప్రదిస్తున్నారు.

క్రికెట్ ప్రేమికులు ఇలా తమకు కాల్స్ చేసి ఒక రాత్రి లేదా రెండు రాత్రులకు అకామడేషన్ అడుగుతున్నారని పలు హాస్పిటల్స్ తెలిపాయి. ఈ కాల్స్ మరీ విపరీతంగా వస్తున్నాయని వాళ్లు వెల్లడించారు. ఇలా హాస్పిటల్‌లో ఉండాలంటే రూ.3 వేల నుంచి రూ.25 వేల వరకు ప్యాకేజీలు ఉంటాయట. అలాగే ఈ ప్యాకేజీలో ఆహారంతోపాటు మెడికల్ ఎగ్జామినేషన్స్ కూడా ఉంటుంది.
ఈ సమయంలో పేషెంట్‌తోపాటు మరొకరు ఉండొచ్చు. దీంతో భారీగా ధరలు పెరిగిన హోటల్స్‌లో ఉండటం కన్నా.. ఇలా హాస్పిటల్ బుక్ చేసుకోవడం బెటరని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. 'హాస్పటల్‌కు ఫోన్ చేసి ఫుల్ బాడీ చెకప్, ఒక నైట్ స్టే కోసం పేషెంట్స్ అడుగుతున్నారు. ఇలా రెండు అవసరాలు తీర్చుకోవచ్చు. అలాగే లాడ్జింగ్ విషయంలో ఖర్చు కూడా తగ్గుతుందని వాళ్లు అనుకుంటున్నారు' అని స్థానిక మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.