Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: మాటలు చాలు.. మా సత్తా చూపిస్తాం: జోస్ బట్లర్

ENGvsSL:సౌతాఫ్రికాతో పాటు ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడి అవమానంతో బాధపడుతున్న డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్.. మరోపక్క సీనియర్ ప్లేయర్ ఏంజెలో మాథ్యూస్‌ జట్టులోకి రావడంతో బలంగా మారిన శ్రీలంక. పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న ఈ రెండు జట్ల మధ్య రసవత్తర పోరు జరగబోతోంది.

బెంగళూరు వేదికగా ఇంగ్లండ్, శ్రీలంక జట్లు తలపడబోతున్నాయి. బ్యాటింగ్‌కు అనుకూలించే చిన్నస్వామి స్టేడియంలో భారీ స్కోర్లు నమోదవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక వరుస ఓటముల నుంచి బయటపడి ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాలని పట్టుదలగా ఉంది బట్లర్ టీం. దానికోసం జట్టులో 3 కీలక మర్పులు కూడా చేసి బరిలోకి దిగుతోంది. దీనికి తోడు టాస్ కూడా ఇంగ్లండ్ జట్టుకే అనుకూలంగా వచ్చింది.

 World Cup 2023 ENGvsSL England playing with three changes

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బట్లర్.. ఇప్పటివరకు మాటలతో సరిపోయిందని, కానీ ఇప్పుడు తమ సత్తా ఏంటో చూపిస్తామని అన్నాడు. జట్టులో హ్యారీ బ్రూక్, గస్ అట్కిన్‌సన్, రీస్ టాప్‌లే స్థానంలో లియామ్ లివింగ్‌స్టోన్, మొయీన్ అలీ, మార్క్‌ వుడ్‌లను తీసుకున్నామని చెప్పాడు.

ఇక శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్ మాట్లాడుతూ.. తాను టాస్ గెలిచున్నా బ్యాటింగ్ ఎంచుకునేవాడినన్నాడు. ఇక జట్టులో ఏంజెలో మాథ్యూస్ తిరిగి రావడంతో కొత్త ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నామన్నాడు.

ఇంగ్లండ్ జట్టు:
జానీ బెయిర్‌‌స్టో, డేవిడ్ మలాన్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లే, అదిల్ రషీద్, మార్క్ వుడ్.

శ్రీలంక జట్టు:
పాథున్ నిస్సాంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్ (కెప్టెన్, వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వ, ఏంజెలో మాథ్యూస్, మహీష్ తీక్షణ, కాసున్ రజిత, దిల్షాన్ మధుశంక, లాహిరు కుమార.

Story first published: Thursday, October 26, 2023, 14:57 [IST]
Other articles published on Oct 26, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+