Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: ఇక ఫ్రీ బిర్యానీ లేదుగా.. పాక్ ఓటమిపై పేలుతున్న జోకులు!

డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్.. ఈ వరల్డ్ కప్‌ను ఘనవిజయంతో ముగించింది. వరుస పరాజయాలతో పరువు కోల్పోయిన ఇంగ్లండ్ తాము ఆడిన చివరి రెండు మ్యాచుల్లో అద్భుతంగా ఆడి అందరినీ మెప్పించింది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచులో ఇంగ్లండ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు.

భారీ లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ తడబడటంతో ఇంగ్ండ్ ఏకంగా 93 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో గెలవడంతో ఇంగ్లండ్ టాప్ 8లో స్థానం సుస్థిరం చేసుకుంది. దీంతో 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అర్హత సాధించింది. ఇక పాకిస్తాన్ మరోసారి వరల్డ్ కప్‌లో పరమ చెత్త ఫామ్ కనబరిచింది.

World Cup 2023 ENGvsPAK Fans brutally troll Pakistan after their exit

ఇటీవలి కాలంలో కేవలం 2011లో మాత్రమే పాకిస్తాన్ టీం.. సెమీస్ చేరుకుంది. గత 20 ఏళ్లలో పాక్ టీం ఆ ఒక్కసారే సెమీస్ గడప తొక్కింది. ఇక ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచులో 338 పరుగుల ఛేజ్‌లో పాకిస్తాన్ తేలిపోయింది. దీంతో 191 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఘోర పరాజయం ముంగిట నిలిచింది. అయితే చివర్లో పేసర్ రవూఫ్ (35) పోరాడటంతో 244 పరుగులకు ఆలౌట్ అయింది.

ఈ ఓటమితో పాకిస్తాన్ అధికారికంగా సెమీస్ రేసు నుంచి తప్పుకుంది. ఇంగ్లండ్ అంత భారీ స్కోరు చేయడంతోనే పాక్ ఆశలు గల్లంతయ్యాయి. ఇక ఈ ఫలితం రావడంతో చాలా అవమానకర రీతిలో టోర్నీ నుంచి తప్పుకుంది పాక్ టీం. దీంతో ఫ్యాన్స్ ఆ జట్టును తెగ ట్రోల్ చేస్తున్నారు. ఫేవరెట్లలో ఒకటిగా టోర్నీ ఆరంభించి, ఇంత దారుణంగా ముగించిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

'అధికారికంగా టోర్నీ నుంచి పాక్ అవుట్. ఇక ప్లేయర్లకు ఫ్రీ బిర్యానీ దక్కదేమో?' అంటూ మరికొందరు జోకులు పేలుస్తున్నారు. అందరూ కూడా 'బై బై పాకిస్తాన్' అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో ఇది నెట్టింట వైరల్ అవుతోంది.

Story first published: Sunday, November 12, 2023, 8:10 [IST]
Other articles published on Nov 12, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+