World Cup 2023: బాబర్ అంత పోటుగాడేం కాదు.. ఆడుకుంటున్న ఫ్యాన్స్!
డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్.. ఈ వరల్డ్ కప్‌ను ఘనవిజయంతో ముగించింది. వరుస పరాజయాలతో పరువు కోల్పోయిన ఇంగ్లండ్ తాము ఆడిన చివరి రెండు మ్యాచుల్లో అద్భుతంగా ఆడి అందరినీ మెప్పించింది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచులో ఇంగ్లండ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు.
భారీ లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ తడబడటంతో ఇంగ్ండ్ ఏకంగా 93 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో గెలవడంతో ఇంగ్లండ్ టాప్ 8లో స్థానం సుస్థిరం చేసుకుంది. దీంతో 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అర్హత సాధించింది. ఇక పాకిస్తాన్ మరోసారి వరల్డ్ కప్‌లో పరమ చెత్త ఫామ్ కనబరిచింది.

ఇటీవలి కాలంలో కేవలం 2011లో మాత్రమే పాకిస్తాన్ టీం.. సెమీస్ చేరుకుంది. గత 20 ఏళ్లలో పాక్ టీం ఆ ఒక్కసారే సెమీస్ గడప తొక్కింది. ఇక ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచులో 338 పరుగుల ఛేజ్‌లో పాకిస్తాన్ తేలిపోయింది. దీంతో 191 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఘోర పరాజయం ముంగిట నిలిచింది. అయితే చివర్లో పేసర్ రవూఫ్ (35) పోరాడటంతో 244 పరుగులకు ఆలౌట్ అయింది.
ఈ ఓటమి నుంచి పాకిస్తాన్‌ను ఎవరూ కాపాడలేకపోయారు. అద్భుతమైన ప్లేయర్ అని బిరుదు అందుకున్న పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (38) మరోసారి విఫలయమ్యాడు. దీంతో అతన్ని మరీ ఎక్కువగా హైప్ చేస్తున్నారని, నిజానికి బాబర్‌కు అంత సీన్ లేదని ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.
అద్భుతమైన బ్యాటర్‌గా పేరున్న బాబర్ ఆజమ్.. ఈ వరల్డ్ కప్ లీగ్ దశలో 9 మ్యాచులు ఆడిన పాక్ కేవలం నాలుగు విజయాలు మాత్రమే సాధించింది. దీంతో పాక్ ఇలా వరల్డ్ కప్ నుంచి అవుట్ అవడాన్ని ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications