వరల్డ్ కప్ పండుగ వచ్చేసింది. తొలి మ్యాచులో 2019 వరల్డ్ కప్ ఫైనలిస్టులు న్యూజిల్యాండ్, ఇంగ్లండ్ తలపడేందుకు రెడీ అవుతున్నాయి. ఆ మ్యాచులో రెండు జట్లు సమానమైన స్కోరు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సూపర్ ఓవర్ కూడా డ్రాగా ముగిసింది. దీంతో ఎక్కువ బౌండరీలు బాదిన జట్టుకు ట్రోఫీ అందజేశారు. దీంతో న్యూజిల్యాండ్ అభిమానుల గుండెలు బద్దలయ్యాయి.
మళ్లీ నాలుగేళ్ల తర్వాత ఈ రెండు జట్లు మెగా టోర్నీ వేదికగా తలపడేందుకు రెడీ అవుతున్నాయి. అయితే ఈ మ్యాచులో అందరి ఫోకస్ ఇద్దరు ఆటగాళ్లపైనే ఉండనుంది గాయం నుంచి కోలుకొని మళ్లీ కివీస్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన కేన్ విలియమ్సన్ చక్కగా ఆడుతున్నాడు. వార్మప్ మ్యాచుల్లో చూడచక్కని షాట్లతో అలరించాడు. దీంతో అతను మళ్లీ ఫామ్ అందుకున్నట్లే కనిపిస్తున్నాడు.

ఇక ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. ఈ మెగా టోర్నీ కోసం తన రిటైర్‌మెంట్‌ను కూడా పక్కన పెట్టి తిరిగొచ్చిన ఈ స్టార్ ప్లేయర్.. ఇటీవలే భారీ శతకంతో తానేంటో నిరూపించుకున్నాడు. వీళ్లిద్దరూ కనుక వరల్డ్ కప్ తొలి మ్యాచులో తలపడితే అద్భుతంగా ఆడాడు. బౌలింగ్‌లో కూడా సత్తా చాటుతున్నాడు.
ఈ క్రమంలోనే అందరి చూపూ వీళ్లిద్దరిపైనే ఉంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడుతున్న సంగతి తెలిసిందే. లక్ష మంది కూర్చునే సామర్థ్యం ఉన్న ఈ స్టేడియంలో పిచ్.. బ్యాటింగ్‌కు బాగా సహకరిస్తుందని పేరు. మరి ఈ మ్యాచులో కూడా ఈ రెండు జట్లు భారీ స్కోర్లు చేస్తాయేమో చూడాలి. ఇంగ్లండ్‌లో లియామ్ లివింగ్‌స్టోన్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు.
స్టోక్స్, లివింగ్‌స్టోన్ చెలరేగితే న్యూజిల్యాండ్ ముందు ఎవరూ ఊహించనంత పెద్ద లక్ష్యం పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో న్యూజిల్యాండ్ బ్యాటింగ్ లైనప్ సమిష్టిగా రాణిస్తోంది. మరి ఈ మ్యాచులో రెండు జట్లలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.