For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ENGvsNZ: వరల్డ్ కప్ ఓపెనర్‌లో ఇంగ్లండ్, కివీస్ ఢీ.. హిస్టరీ ఎవరు గెలుస్తారని చెప్తోంది?

వరల్డ్ కప్ 2023 ఓపెనర్‌లో గత మెగా టోర్నీ ఫైనలిస్టులు న్యూజిల్యాండ్, ఇంగ్లండ్ తలపడుతున్నాయి. ఈ టోర్నీకి ముందు జరిగిన చివరి ఐదు మ్యాచుల్లో కేవలం ఒక్క మ్యాచులోనే కివీస్ గెలిచింది. 2019 వరల్డ్ కప్ ఫైనల్ డ్రాగా ముగియగా.. ఆ తర్వాత ఒక్క మ్యాచులోనే కివీస్ నెగ్గింది. మిగతా మూడు మ్యాచుల్లో ఇంగ్లండ్ విజేతగా నిలిచింది.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వరల్డ్ కప్ 2023 ఓపెనింగ్ మ్యాచ్ జరుగుతోంది. బ్యాటింగ్‌కు స్వర్గధామంగా చెప్పుకునే ఇంగ్లండ్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ టీంలో లివింగ్‌స్టోన్, బట్లర్ వంటి బడా ప్లేయర్లు ఉన్నారు. బ్యాటింగ్‌కు సహకరించే ఈ పిచ్‌పై వాళ్లు భారీ స్కోర్లు చేయడం గ్యారంట అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

World Cup 2023 ENGvsNZ head to head stats will not give a clear winner

అదే సమయంలో న్యూజిల్యాండ్ కూడా బలంగానే ఉంది. కేన్ విలియమ్సన్ రీఎంట్రీలో ఆకట్టుకుంటున్నాడు. మిగతా బ్యాటర్లు కూడా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే అసలు ఈ రెండు టీమ్స్ మధ్య వన్డే రికార్డులు ఎలా ఉన్నాయి? ఎవరిపై ఎవరు పైచేయి సాధించారు? అని వెతకడం మొదలు పెట్టారు. అలాంటి వారి కోసమే ఈ వివరాలు.

అయితే కేన్ విలియమ్సన్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని దీంతో తొలి మ్యాచ్ ఆడటం లేదని తెలుస్తోంది. అలాగే స్టార్ పేసర్ టిమ్ సౌథీ కూడా ఆ మ్యాచ్ ఆడట్లేదట. ఇంగ్లండ్ స్టార్ బెన్ స్టోక్స్‌కు నడుం నొప్పి రావడంతో అతను కూడా ఈ మ్యాచ్‌కు దూరమైనట్లు తెలుస్తోంది. ఇలా గాయాల వల్ల రెండు జట్లు పూర్తి బలంతో ఆడటం కష్టంగా కనిపిస్తోంది.

ఇక ఈ రెండు టీమ్స్ హెడ్ టు హెడ్ గణాంకాలు పరిశీలిస్తే.. ఈ రెండు టీమ్స్ 95 సార్లు వన్డే ఫార్మాట్‌లో తలపడ్డాయి. వీటిలో 44 సార్లు ఇంగ్లండ్ గెలిచింది. అలాగే 44 సార్లు న్యూజిల్యాండ్ నెగ్గింది. మూడు మ్యాచులు టై అయ్యాయి. వీటిలో 2019 వరల్డ్ కప్ మ్యాచ్ కూడా ఒకటి. ఆ మ్యాచులో ఎక్కువ బౌండరీలు కొట్టిన కారణంగా ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Story first published: Thursday, October 5, 2023, 9:55 [IST]
Other articles published on Oct 5, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+