Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ENGvsNED: డిఫెండింగ్ ఛాంపియన్‌లా ఆడిన ఇంగ్లండ్.. నెదర్లాండ్స్ ముందు భారీ టార్గెట్!

World Cup 2023: ఈ వరల్డ్ కప్‌లో ఎట్టకేలకు ఇంగ్లండ్ జట్టు తమ స్తాయికి తగ్గ ప్రదర్శన చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టోర్నీ మొదలు పెట్టిన ఇంగ్లండ్ వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో చిట్టచివరన నిలిచింది. ఈ క్రమంలోనే తమ చివరి లీగ్ మ్యాచులో నెదర్లాండ్స్‌ను ఢీకొట్టింది. పూణేలోని ఎంసీఏ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరిగింది.

టాస్ గెలిచిన ఇంగ్లండ్ సారధి జోస్ బట్లర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఆ జట్టుకు అనుకున్న ఆరంభం లభించలేదు. జానీ బెయిర్‌స్టో (15) మరోసారి విఫలమయ్యాడు. క్రీజులో కుదురుకున్నట్లే కనిపించిన జో రూట్ (28) కూడా పెద్దగా రాణించలేదు. హ్యారీ బ్రూక్ (11), జోస్ బట్లర్ (5), మొయీన్ అలీ (4), డేవిడ్ విల్లే (6) ఎవరూ రాణించలేదు.

World Cup 2023 ENGvsNED Stokes hundred pushes England to a huge score

అయితే డేవిడ్ మలాన్ (87) అద్భుతంగా ఆడాడు. ఆ తర్వాత అతనికి జతకలిసిన బెన్ స్టోక్స్ (108) చెలరేగాడు. వీరితోపాటు ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ (51) కూడా హాఫ్ సెంచరీతో మెరిశాడు. వీళ్లు ముగ్గురూ రాణించడంతో ఇంగ్లండ్ జట్టు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో స్టోక్స్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఎడాపెడా బౌండరీలతో నెదర్లాండ్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 339 పరుగుల భారీ స్కోరు చేసింది.

ఇక నెదర్లాండ్స్ బౌలర్లలో ఎవరూ పరుగులు కట్టడి చేయలేకపోయారు. అయితే బాస్ డీ లీడ్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అతనికి చక్కని సహకారం అందించిన ఆర్యన్ దత్, లోగన్ వాన్ బీక్ చెరో రెండు వికెట్లతో రాణించారు. పాల్ వాన్ మీకరన్ ఒక వికెట్ తీసుకున్నాడు. మరి నెదర్లాండ్స్ ఈ మ్యాచులో అద్భుతం సృష్టిస్తుందేమో చూడాలి.

Story first published: Wednesday, November 8, 2023, 18:15 [IST]
Other articles published on Nov 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+