Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: పాక్‌తో మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నాం: జోస్ బట్లర్

ఈ వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ జట్టుకు రెండో విజయం దక్కింది. పసికూన నెదర్లాండ్స్‌పై ప్రతాపం చూపించిన ఇంగ్లండ్ జయభేరి మోగించింది. ఏకంగా 160 పరుగుల తేడాతో ఈ మ్యాచులో విజయం సాధించింది. పూణేలోని ఎంసీఏ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను ఎదుర్కొన్న ఇంగ్లండ్ చెలరేగింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ సారధి జోస్ బట్లర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

డేవిడ్ మలాన్ (87) అద్భుతంగా ఆడాడు. ఆ తర్వాత అతనికి జతకలిసిన బెన్ స్టోక్స్ (108) చెలరేగాడు. వీరితోపాటు ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ (51) కూడా హాఫ్ సెంచరీతో మెరిశాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 339 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ దారుణంగా తడబడింది. తెలుగు కుర్రాడు తేజ నిడమనూరు (41 నాటౌట్) పోరాడినా అతనికి సహకారం లభించలేదు.

World Cup 2023 ENGvsNED Jos Buttler waiting to face Pakistan at Kolkata

వెస్లీ బారెసీ (37), సైబ్రాండ్ ఎండెల్‌బ్రెట్ (33), స్కాట్ ఎడ్వర్డ్స్ (38) తమకు దక్కిన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. దీంతో నెదర్లాండ్స్ జట్టు 37.2 ఓవర్లలో కేవలం 179 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇంగ్లండ్ ఏకంగా 160 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఈ విజయంపై ఇంగ్లండ్ సారధి జోస్ బట్లర్ సంతోషం వ్యక్తం చేశాడు.

'మాకు ఈ విజయం అత్యవసరం. అలాంటి సమయంలో మలాన్ మంచి ఆరంభం అందించాడు. మిడిలార్డర్‌లో కొంత తడబడ్డాం. అయితే వోక్స్, స్టోక్స్ అద్భుతంగా పోరాడారు. ఎవరైనా జట్టును ఆదుకోవాల్సి వచ్చినప్పుడు స్టోక్స్ ఆ బాధ్యత తీసుకుంటాడు. అలాంటి పరిస్థితి ఎదుర్కోవడానికి ఈ టీంలో అతను ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నా. వోక్స్, స్టోక్స్ ఇద్దరూ చక్కగా ఆడారు' అని బట్లర్ అన్నాడు.

'మేం చేసింది చాలా మంచి స్కోరు అని అనుకున్నాం. అందరూ ఇది మంచి పిచ్ అనే చెప్పారు. ఇక లాస్ట్ మ్యాచులో టాస్ సమయంలో తీసుకున్న నిర్ణయం సరైంది కాదనే చెప్పాలి. అయితే కేవలం దాన్నే బ్లేమ్ చేయలేం. మేం కూడా బాగా ఆడాలి కదా. ఆ మ్యాచులో మేం సరిగా ఆడలేదు. టాస్‌లు కొంచెం ఇంట్రస్టింగ్‌గా ఉన్నాయి. ఇది వరల్డ్ కప్ అవడం వల్ల ఆ ఒత్తిడి కూడా మాపై పడిందేమో?' అని అభిప్రాయపడ్డాడు.

'అయితే ఈ టోర్నీలో మంచి స్కోరు చేసిన జట్లే రాణించాయి. టాస్ గెలిచిన జట్లు కూడా అంత గొప్పగా ఏం ఆడలేదు. విల్లీకి ఒక్క వికెట్ మాత్రమే దక్కింది. కానీ అతని బౌలింగ్‌ అద్భుతంగా ఉంది. అతనికి మరిన్ని వికెట్లు దక్కాల్సింది. మా ఓపెనింగ్ బౌలర్లు చక్కగా బౌలింగ్ చేశారు. కోల్‌కతా మ్యాచుకోసం వెయిట్ చేస్తున్నాం. వరుస పరాజయాల తర్వాత ఈ విజయం సంతోషాన్నిస్తోంది' అని పేర్కొన్నాడు.

Story first published: Wednesday, November 8, 2023, 21:53 [IST]
Other articles published on Nov 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+