For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ENGvsNED: మళ్లీ ‘టైం అవుట్’ చూసేవాళ్లమే.. జస్ట్ మిస్ అయిపోయాడుగా..!

World Cup 2023: ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చనీయాంశంగా మారిన అంశం 'టైం అవుట్' డిస్మిసల్. బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచులో లంక వెటరన్ బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ ఇలాగే అవుటయ్యాడు. ఒక వికెట్ పడిన తర్వాత రెండు నిమిషాల్లోగా తదుపరి బ్యాటర్ క్రీజులో రెడీగా ఉండాలని ఎంసీసీ రూల్. కానీ ఈ మ్యాచులో క్రీజులోకి వచ్చిన తర్వాత మాథ్యూస్ హెల్మెట్ స్ట్రాప్ తెగిపోయింది.

దీంతో అతను మరో హెల్మెట్ అడిగాడు. అది వచ్చేసరికి బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబల్ హసన్ అండ్ టీం అప్పీల్ చేశారు. మాథ్యూస్ టైం అవుట్ అంటూ గోల చేశారు. ఈ అప్పీల్‌ చూసి ముందుగా ఆశ్చర్యపోయినా కూడా.. బంగ్లా టీం సీరియస్‌గా అప్పీల్ చేసిందని తెలిసిన అంపైర్లు మాథ్యూస్‌ను అవుట్‌గా ప్రకటించారు. ఇది పెద్ద దుమారానికి తెరలేపింది.

World Cup 2023 ENGvsNED Fans just missed another timed out as Woakes has helmet problem

హెల్మెట్ స్ట్రాప్ తెగిపోతే మాథ్యూస్ ఏం చేస్తాడని చాలా మంది ప్రశ్నించారు. ఇలాంటి సీన్ మరోసారి రిపీట్ అయ్యేదే. నెదర్లాండ్స్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచులో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. అతను క్రీజులోకి వచ్చినప్పుడు హెల్మెట్‌లో ఏదో లోపం కనిపించింది.

అయితే తనను కూడా టైం అవుట్ ఇచ్చేస్తారని భయపడిన అతను.. వెంటనే అంపైర్ల వద్దకు వెళ్లి తన సమస్యను చూపించాడు. వాళ్ల పర్మిషన్‌తో ఇంకో హెల్మెట్ తెప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన పొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇవన్నీ చూసిన ఫ్యాన్స్.. అన్ని టీమ్స్ బంగ్లాదేశ్ అంత చెత్తగా ప్రవర్తించవని అంటున్నారు.

మరికొందరేమో ఇంకో పెద్ద సీన్ జరగకుండా వోక్స్ జాగ్రత్తపడ్డాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా బంగ్లాదేశ్ చేసిన పని.. ఫ్యాన్స్‌కు ఏమాత్రం నచ్చలేదు. దీనిపై ఐసీసీ వెంటనే చర్యలు తీసుకోవాలని, ఈ నిబంధనకు సవరణలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఐసీసీ ఏం చేస్తుందో చూడాలి.

Story first published: Wednesday, November 8, 2023, 19:14 [IST]
Other articles published on Nov 8, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+