Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ENGvsAFG: హిస్టరీ రిపీట్ చేయాలని చూస్తున్న ఇంగ్లండ్..!

డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను పసికూన ఆఫ్ఘనిస్తాన్‌ ఢీకొడుతోంది. ఆడిన రెండు మ్యాచ్‌లలో ఒకటి గెలిచి, ఒకటి ఓడిన ఇంగ్లండ్ ఇప్పుడు ఆఫ్ఘన్‌పై గెలిచి హిస్టరీ రిపీట్ చేయాలని చూస్తుంటే.. మరోపక్క ఆఫ్ఘనిస్తాన్ ఎలాగైనా ఇంగ్లండ్‌కు షాకిచ్చి చరిత్ర తిరగరాయాలని పట్టుదలగా ఉంది.

వన్డే వరల్డ్ కప్‌ 2023లో భాగంగా ఈ రోజు ఇంగ్లండ్, ఆప్ఘన్ జట్లు ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో తలపడబోతున్నాయి. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్‌కు బాగా సహకరించేలా ఉండడంతో ఛేజింగ్‌ సులభంగా ఉంటుందని, అలాగే సాయంత్రం మంచు కురిసే అవకాశం ఉండడంతో బౌలింగ్ ఎంచుకున్నట్లు ఇంగ్లీష్ కెప్టెన్ బట్లర్ చెప్పుకొచ్చాడు. అలాగే బంగ్లాదేశ్‌తో ఆడిన జట్టుతోనే ఈ మ్యాచ్‌లో కూడా బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించాడు.

World Cup 2023 England wants to repeat history against Afghanistan

ఇక ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా కూడా తాను టాస్ గెలిచున్నా బౌలింగ్ ఎంచుకునేవాడినన్నాడు. అయితే తమ బ్యాటర్లు 300 పైగా స్కోరు చేయగలిగితే మ్యాచ్‌పై పట్టు సాధించే అవకాశం ఉంటుందని, తమ స్పిన్నర్లకు కూడా ఫైటింగ్ టోటల్‌ను డిఫెండ్ చేసుకోవడం సులువవుతుందన్నాడు. చివరిగా జట్టులో ఓ మార్పు చేసినట్లు తెలిపాడు. నిజబ్‌ స్థానంలో ఇక్రామ్‌ను తీసుకున్నామన్నాడు.

2019 వరల్డ్ కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ ఆడిన 9 మ్యాచ్‌ల్లోనూ ఓడింది. ముఖ్యంగా ఇంగ్లండ్ చేతిలో ఏకంగా 150 పరుగుల తేడాతో ఓడింది. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 397 పరుగులు చేయగా.. ఆఫ్ఘన్ 247 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇయాన్ మోర్గాన్ (148) సెంచరీతో అదరగొట్టగా, జానీ బెయిర్ స్టో(90), జో రూట్ (88) అర్థసెంచరీలతో రాణించారు. ఆఫ్ఘన్ జట్టులో ఒక్క హష్మతుల్లా (76) తప్ప మరొక్కరు కూడా రాణించలేకపోయారు.

నిజానికి చిన్న జట్ల చేతుల్లో అనూహ్యంగా ఓడిపోవడం ఇంగ్లండ్‌కు అప్పుడప్పుడూ అలవాటే. ఐర్లాండ్, బంగ్లాదేశ్ లాంటి టీంల చేతుల్లో కూడా అప్పుడప్పుడూ ఓడిపోతూ ఉంటుంది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ కూడా అప్పుడప్పుడూ పెద్ద పెద్ద జట్లకు కూడా షాకిస్తూ ఉంటుంది. 2019 వరల్డ్ కప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘన్ అద్భుతంగా ఆడింది. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొని గెలిచినంత పని చేసింది. మరి ఈ మ్యాచ్‌లో కూడా అలాంటి మ్యాజిక్ ఏమైనా జరుగుతుందేమో చూడాలి.

ఇంగ్లండ్ జట్టు:
జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్ & వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, శామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, అదిల్ రషీద్, రీస్ టాప్లే

ఆఫ్ఘనిస్తాన్ జట్టు:
రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), రషీద్ ఖాన్, ముజీబుర్ రెహ్మాన్, ముజీబ్-ఉల్-హక్, ఫజల్హక్ ఫరూకీ

Story first published: Sunday, October 15, 2023, 14:26 [IST]
Other articles published on Oct 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+