For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

World cup 2023: థ్యాంక్యూ బీసీసీఐ.. స్వీట్ మెమరీని మళ్లీ గుర్తు చేశావ్..!

ఐసీసీ వరల్డ్‌ కప్ 2023లో ఆటగాళ్లే కాదు.. డ్రింక్స్ వ్యాన్ తెగ వైరల్ అవుతోంది. మ్యాచ్ మధ్యలో వచ్చే డ్రింక్స్ బ్రేక్‌లో ఆటగాళ్ల దాహం తీర్చడానికి సదరు జట్టు స్టాఫ్ లేదా తోటి ఆటగాళ్లే డ్రింక్స్ తీసుకొస్తారు. కానీ ఈ వరల్డ్ కప్‌లో డ్రింక్స్‌ తీసుకురావడానికి ఓ ప్రత్యేకమైన వ్యాన్‌ను ఉపయోగించారు. ఈ వ్యాన్‌ను చూసిన క్రికెట్ ఫ్యాన్స్ అలనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు.

ఆదివారం జరిగిన ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్‌లో భారత్ అద్భుతమైన విజయం సాధించింది. టాప్ ఆటగాళ్లు రోహిత్ శర్మ (0), ఇషాన్ కిషన్ (0), శ్రేయస్ అయ్యర్ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరడంతో భారత్ ఓటమి ఖాయం అనుకున్నారంతా. కానీ కేఎల్ రాహుల్‌ (97*)తో కలిసి రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (85) అద్వితీయమైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్నందించాడు.

World cup 2023 Drinks van of CWC 2023 going viral

ఇక మ్యాచ్ జరుగుతున్న సమయంలో కోహ్లీ, రాహుల్ ఇన్నింగ్స్‌తో పాటు మరో విషయం కూడా స్టేడియంలోని ఫ్యాన్స్‌ను ఆకర్షించింది. అదే స్పోర్ట్జ్ ఎనర్జీ డ్రింక్స్ బ్రాండ్‌కు చెందిన డ్రింక్స్ వ్యాన్. స్పోర్ట్జ్ ఎనర్జీ డ్రింక్ బాటిల్ ఆకారంలో ఉన్న ఈ వ్యాన్‌ ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించింది. ఇంకేముంది దీని ఫోటోలను సోషల్ మీడియాలో తెగ షేర్ చేయడం మొదలు పెట్టారు ఫ్యాన్స్.

క్రికెట్లో ఒకప్పుడు డ్రింక్స్ బ్రేక్‌లో ఆటగాళ్లకు డ్రింక్స్ అందించేందుకు స్పెషల్‌ వ్యాన్స్‌లో డ్రింక్స్‌ను మైదానంలోకి తీసుకొచ్చేవాళ్లు. ఆటగాళ్లంతా ఈ వ్యాన్ దగ్గరకొచ్చి డ్రింక్స్ తాగేవాళ్లు. ఆ డ్రింక్స్ వ్యాన్‌ సదరు డ్రింక్ బాటిల్ ఆకారంలో ఉండేది. ఈ పద్ధతి చాలా కాలం పాటు క్రికెట్లో కొనసాగింది.

1996 వరల్డ్ కప్ సమయంలో కూడా అప్పటి టోర్నీ స్పాన్సర్ కోకాకోలా బ్రాండింగ్‌తో ఉన్న డ్రింక్స్ వ్యాన్ ద్వారానే ఆటగాళ్లకు డ్రింక్స్ అందించేవారు. ఇది కోకాకోలా బాటిల్ ఆకారంలో ఉండేది. దీంతో అప్పట్లో ఇది బాగా ఫేమస్ అయింది కూడా.

కానీ తర్వాతి కాలంలో డ్రింక్స్ వ్యాన్‌లు కనుమరుగైపోయాయి. కానీ 3 దశాబ్దాల తర్వాత మళ్లీ ఇప్పుడు 2023 ప్రపంచకప్‌లో ఈ వ్యాన్స్ కనిపించి ఫ్యాన్స్‌ను అలరించాయి. 2023 ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీకి అఫీషియల్ డ్రింక్స్ స్పాన్సర్‌షిప్ సొంతం చేసుకున్న లిమ్‌కా స్పోర్ట్జ్.. ఆటగాళ్లకు డ్రింక్స్ అందించడం మొదలుపెట్టింది.

అయితే స్పోర్ట్జ్ డ్రింక్ బాటిల్ ఆకారంలో ఉన్న వ్యాన్ ద్వారా లిమ్‌కా స్పోర్ట్జ్ ఆటగాళ్లకు డ్రింక్స్ అందించడం ఇప్పుడు వైరల్ అవుతోంది. దీంతో ఈ వ్యాన్ ఫోటోలను అలనాటి డ్రింక్స్ వ్యాన్ ఫోటోలతో కలిపి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ 'థ్యాంక్యూ బీసీసీఐ.. స్వీట్ మెమరీని మళ్లీ గుర్తు చేశావ్..!' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Story first published: Monday, October 9, 2023, 20:14 [IST]
Other articles published on Oct 9, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+