Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ROHITvsKOHLI: కోహ్లీ, రోహిత్‌లలో ఎవరు బెటర్.. తెలివైన ఆన్సర్‌తో తప్పించుకున్న దినేశ్ కార్తీక్!

'రోహిత్ బెటరా..? కోహ్లీ బెటరా..?' ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టం. సీనియర్లు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడతారు. కానీ తాజాగా టీమిండియా వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌కు సరిగ్గా ఇదే ప్రశ్న ఎదురైంది. దీంతో అతడు కూడా సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడినా ఫైనల్‌గా ఓ తెలివైన ఆన్సర్ ఇచ్చి తప్పించుకున్నాడు.

టీమిండియాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రస్తుతం సూపర్ ఫాంతో కొనసాగుతున్నారు. వీళ్లిద్దరూ మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌కి మంచి ఫ్రెండ్స్ కూడా. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దినేశ్ కార్తీక్‌కు వీళ్లిద్దరికీ సంబంధించి ఓ ట్రికీ క్వశ్చన్ ఎదురైంది.

World Cup 2023 Dinesh karthik on Who is better between Rohit and Kohli

'విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. వీళ్లిద్దరిలో ఎవరు బెటర్..? ఎవరి ఆట చూడడానికి ఇష్టపడతారు..?' అని యాంకర్ అడగడంతో దినేశ్ కార్తిక్ ఇబ్బంది పడ్డాడు. ఈ ప్రశ్నకు దినేశ్.. 'సర్! వాళ్లిద్దరూ నా స్నేహితులే. కానీ నన్ను ఇలాంటి ఇబ్బందిలోకి నెట్టడం వల్ల మీకేంటంత ఆనందం చెప్పండి' అంటూ నవ్వేశాడు. కానీ చివరిగా ఓ తెలివైన ఆన్సర్ ఇచ్చాడు.

'నేను టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంటే రోహిత్ బ్యాటింగ్ చూడడం ఇష్టపడతాను. రోహిత్ మూడు డబుల్ సెంచరీలు బాదాడంటే అతడెంత భీకర ఆటగాడో వేరే చెప్పనక్కర్లేదు. అందుకే అతడి ఓపెనింగ్ అంటే చాలా ఇష్టం. అదే ఛేజింగ్‌లో అయితే రన్ మెషీన్ విరాట్ బ్యాటింగ్ చూడడానికి ఇష్టపడతాను' అని చెప్పాడు.

ఇక పాకిస్తాన్‌పై భారత బౌలింగ్ అటాక్‌ గురించి కూడా దినేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. టీమిండియాతో మ్యాచ్‌లో పాకిస్తాన్ కుప్పకూలిందని, దానికి అద్భుతమైన భారత బౌలింగే కారణమని దినేశ్ చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్‌పై బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని వైపుల నుంచి టీమిండియా ఒత్తిడి పెంచిందని, అందుకే పాకిస్తాన్ ఓడిపోయిందని దినేశ్ కార్తీక్ వివరించాడు.

Story first published: Thursday, October 19, 2023, 15:48 [IST]
Other articles published on Oct 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+