For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ENGvsBAN: పసికూనపై చెలరేగిన ఇంగ్లండ్.. ఛాంపియన్ అంటే ఇలా కదా ఆడాలి!

బంగ్లాదేశ్‌పై ఇంగ్లండ్ భారీ విజయం నమోదు చేసింది. ఏకంగా 137 పరుగుల తేడాతో విజయం సాధించింది. అలాగే టోర్నీలో తొలి గెలుపు నమోదు చేసింది. ఈ మ్యాచులో ఇంగ్లండ్ బ్యాటర్ డేవిడ్ మలన్ అద్భుతమైన శతకంతో చెలరేగాడు.

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ధర్మశాల వేదికగా ఇంగ్లండ్, బంగ్లాదేశ్ మధ్య ఈ రోజు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు అదిరిపోయే ఓపెనింగ్ దక్కింది. జానీ బెయిర్ స్టో(52) హాఫ్ సెంచరీ నమోదు చేసి మంచి ఓపెనింగ్ ఇచ్చాడు.

World cup 2023 David Malan shines as England thrashes Bangladesh by 137 runs

ఇక మరో ఓపెనర్ డేవిడ్ మలాన్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. 107 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్స్‌లతో ఏకంగా 140 పరుగులు చేసి బంగ్లా బౌలర్లను ఉతికారేశాడు. ఆ తర్వాత జో రూట్ (82) కూడా చెలరేగి ఆడడంతో ఇంగ్లండ్ స్కోరు సునాయాసంగా 400 మార్క్ దాటేస్తుందని అనుకున్నారంతా.

కానీ రూట్ అవుటైన తర్వాత మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతగా రాణించకపోవడంతో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 364 పరుగులు మాత్రమే చేయగలిగింది. బంగ్లా బౌలర్లలో మెహెదీ హసన్ 4, షొరిఫుల్ ఇస్లామ్ 3 వికెట్లు తీయగా.. షకిబ్ అల్ హసన్, టస్కిన్ అహ్మద్ చెరో వికెట్ తీసుకున్నారు.

ఇక 365 పరుగులు భారీ టార్గెట్ ఛేదనలో బరిలోకి దిగిన బంగ్లాకు రెండో ఓవర్లోనే షాకిచ్చాడు ఇంగ్లీష్ పేసర్ రీస్ టాప్లే. ఓపెనర్ తంజిద్ హసన్‌ (1) అవుట్ చేసి బంగ్లా పతనానికి నాంది పలికాడు. అదే ఓవర్లో నజ్‌ముల్ హొస్సైన్ షాంటో (0)ను కూడా పెవిలియన్ పంపిన టాప్లే కోలుకోలేని దెబ్బ కొట్టాడు.

ఆ తర్వాత బంగ్లా కెప్టెన్ షకిబ్ అల్ హసన్ (1), మెహెద హసన్ మిరాజ్ (8) కూడా వెంటనే వెంటనే అవుట్ కావడంతతో బంగ్లా ఓటమి దిశగా పయనించింది. అయితే మిడిలార్డర్‌లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ముష్ఫికర్ రహీమ్(51) మరో వికెట్ పడకుండా బ్యాటింగ్ చేయసాగాడు. ఓపెనర్ లిటాన్ దాస్(76) తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దసాగాడు.

అయితే లిటాన్ దాస్ అవుటైన తర్వాత తౌహీద్ హృదోయ్ (39) మాత్రమే కొద్దిగా పోరాడగా.. మిగిలిన బ్యాటర్లంతా అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు.

ఫలితంగా బంగ్లా జట్టు 48.2 ఓవర్లలో 227 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్ ఏకంగా 137 పరుగుల తేడాతో భారీ విజయం దక్కించుకుంది. ఇంగ్లీష్ బౌలర్లలో రీసీ టాప్లీ 4 వికెట్లు తీయగా, క్రిస్ ఓక్స్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. మిగిలిన బౌలర్లంతా తలా ఓ వికెట్ సాధించారు.

ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆల్ రౌండ్ ప్రదర్శన చూసిన ఫ్యాన్స్.. ఇది కదా మ్యాచ్ అంటే, డిఫెండింగ్ ఛాంపియన్ అంటే ఇలా ఆడాలి కదా అంటే ఇంగ్లండ్‌ను ప్రశంసిస్తున్నారు.

Story first published: Tuesday, October 10, 2023, 19:39 [IST]
Other articles published on Oct 10, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+