Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: ఒత్తిడిలో పాకిస్తాన్.. కీలక మ్యాచ్‌లో మ్యాజిక్ చేయగలదా..?

SAvsPAK: వరల్డ్ కప్‌లో వరుస ఓటములతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన పాకిస్తాన్ పటిష్ఠ సౌతాఫ్రికాతో తలపడబోతోంది. వరల్డ్ కప్‌లో సెమీ ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే పాకిస్తాన్‌కు ఈ మ్యాచ్‌లో గెలవడం చాలా అవసరం. చెపాక్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.

పాక్ కెప్టెన్ బాబర్ మాట్లాడుతూ.. 'ఇక్కడినుంచి ప్రతి మ్యాచ్ మాకు ముఖ్యమైనదే.. కాబట్టి మా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ముందుగా బ్యాటింగ్ చేస్తున్నాం కాబట్టి భారీ స్కోరు చేయడానికి ట్రై చేస్తాం. అన్ని విభాగాల్లో మేం మెరుగవ్వాలి, మరీ ముఖ్యంగా ఫీల్డింగ్, బౌలింగ్ విభాగాల్లో చాలా వెనుకబడి ఉన్నాం. ఆ సమస్యను ఈ మ్యాచ్‌లో అధిగమించడానికి ప్రయత్నిస్తాం' అని బాబర్ చెప్పుకొచ్చాడు.

World Cup 2023 Can Pakistan break their losing streak

అలాగే జట్టులో జ్వరంతో బాధపడుతున్న హసన్ అలీ స్థానంలో మహమ్మద్ వసీంను, ఉస్మాన్ మిర్ స్థానంలో నవాజ్‌ను తీసుకున్నట్లు చెప్పాడు. ఇక సౌతాఫ్రికా జట్టులో టెంబా బవూమా తిరిగొచ్చాడు. అలాగే షమ్షి, ఎన్గిడీ జట్టులోకొచ్చారు. రీజా హెన్డ్రిక్స్, లిజాడ్ విలియమ్స్, కగీసో రబాడాలు జట్టుకు దూరమయ్యారు.

ఇక పిచ్ విషయానికొస్తే.. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించేలా ఉంది. దీంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాకిస్తాన్ బ్యాటర్లు రాణిస్తే స్కోరు కచ్చితంగా 300 దాటే అవకాశం కనిపిస్తోంది.

పాకిస్తాన్ జట్టు:
ఇమామ్-ఉల్-హక్, అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, మహమ్మద్ వసీం, హారిస్ రవూఫ్

సౌతాఫ్రికా జట్టు
టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డీ కాక్ (వికెట్ కీపర్), రాస్సీ వాన్ డర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రం, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో యాన్సెన్, జెరాల్డ్ కోట్జీ, కేశవ్ మహారాజ్, తబ్రైజ్ షంసీ, లుంగీ ఎన్గీడి.

Story first published: Friday, October 27, 2023, 14:35 [IST]
Other articles published on Oct 27, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+