Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒక్క ప్లేయర్ ఉంటే కప్పులు దక్కవు.. కపిల్ దేవ్ ఉంటే వరల్డ్ కప్ వస్తుందా?

దశాబ్ద కాలంగా టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా నెగ్గలేదు. అత్యంత బలమైన జట్లలో ఒకటిగా పేరొందినా కూడా.. ఐసీసీ టోర్నీల్లో చేతులెత్తేయడం భారత్‌కు అలవాటుగా మారింది. ఈ క్రమంలోనే జట్టు గెలవాలంటే ఎలాంటి ప్లేయర్లు కావాలి? అని అందరూ చర్చించుకుంటున్నారు.

కొంత మంది 1983 వరల్డ్ కప్ హీరో కపిల్ దేవ్ వంటి ప్లేయర్ మన టీంలో లేరంటూ బాధ పడుతున్నాడు. ఆ వరల్డ్ కప్‌లో కపిల్ దేవ్ ఎంత అద్భుతంగా రాణించాడో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అయితే జట్టుకు మరో కపిల్ దేవ్ అవసరం లేదని స్వయంగా ఆ లెెజెండరీ క్రికెటరే అన్నాడు. 'ఇంకో కపిల్ దేవ్ అసలు ఎందుకు? ఒక్క కపిల్ మీకు వరల్డ్ కప్ ఇవ్వలేడు' అని తేల్చేశాడు.

World Cup 2023 Can India win World Cup with single Kapil Dev

'మీకు ఒక మంచి టీం కావాలి. అప్పుడు మీకు నా కంటె బెటర్ ప్లేయర్ దొరుకుతాడు' అని కపిల్ చెప్పాడు. అంతేకాదు, తరం మారేకొద్దీ మెరుగైన క్రికెటర్లు బయట పడుతున్నారని తెలిపాడు. కొత్త క్రికెటర్లు బౌలింగ్, బ్యాటింగుల్లో ఇంకా మెరుగ్గా ఉంటారు. కాబట్టి ప్రపంచ క్రికెట్‌లో మరో సంచలనం ఉండదని చెప్పలేం అన్నాడు.

'మనకు ఇంకో డాన్ బ్రాడ్‌మన్ దొరకలేదు. మనం అతని కోసం వెతకం కూడా. అలాగే సునీల్ గవాస్కర్ తర్వాత అతని దరిదాపుల్లోకి కూడా ఎవరూ రాలేరని అనుకున్నాం. కానీ సచిన్ చాలా ఈజీగా అన్నీ దాటేశాడు. ఇక సచిన్ తర్వాత మరో ప్లేయర్ దొరుకుతాడా? అని భయపడ్డాం. ఇప్పుడు అక్కడ కోహ్లీ కూర్చొని ఉన్నాడు' అని కపిల్ వివరించాడు.

'సచిన్ కన్నా మెరుగైన యావరేజ్, బెటర్ స్కోర్లు, ఇంకా మెరుగైన ఫిట్‌నెస్‌తో కోహ్లీ వచ్చాడు. కాబట్టి కొత్త తరం ఎప్పుడూ మరింత మెరుగ్గానే ఉంటుంది. వాళ్లపై కొంత ఇన్వెస్ట్ చేసి, జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది' అని కపిల్ వివరించాడు. అంతేకానీ, మరో స్టార్ ప్లేయర్ కోసం వెతుక్కోవడం అనవసరం అన్నాడు.

Story first published: Tuesday, August 1, 2023, 9:48 [IST]
Other articles published on Aug 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+