For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సీఎస్‌కే స్టార్ విధ్వంసం.. ఎందుకు రిటైర్ అయ్యావు? అంటున్న ఫ్యాన్స్!

వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీ ఉందంటే చాలు ఇంగ్లండ్ టీం ఆటతీరు మారిపోతుంది. అప్పటి వరకు సాదాసీదాగా ఉన్న ఆ జట్టు సడెన్‌గా చాలా పవర్‌ఫుల్‌గా తయారవుతుంది. ఈ ఏడాది కూడా అదే జరుగుతోంది. నిన్నమొన్నటి వరకు ఒక మాదిరి ఆట ఆడిన ఇంగ్లండ్ జట్టు సరిగ్గా వరల్డ్ కప్ ముందు చెలరేగుతోంది.

ముఖ్యంగా రిటైర్‌మెంట్ వెనక్కు తీసుకొని వచ్చిన బెన్ స్టోక్స్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ప్రస్తుతం న్యూజిల్యాండ్‌తో ఇంగ్లండ్ వన్డే సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీసులో మూడు వన్డేలో ఇంగ్లండ్ ఘనవిజయం సాధించింది. ఓవల్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో ఏకంగా 181 పరుగుల తేడాతో నెగ్గింది.

World Cup 2023 Ben Stokes makes history with the bat

ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌కు సరైన ఆరంభం దక్కలేదు. జానీ బెయిర్‌స్టో (0) ఖాతా తెరవకుండానే అవుటయ్యాడు. అయితే డేవిడ్ మలన్ (96), బెన్ స్టోక్స్ (182) ఇద్దరూ చెలరేగారు. మిగతా బ్యాటర్లు ఎవరూ అంతగొప్పగా రాణించలేదు. కానీ స్టోక్స్, మలన్ అద్భుతమైన ఇన్నింగ్సులతో ఆ టీం 48.1 ఓవర్లలో 368 పరుగుల భారీ స్కోరు చేసింది.

ఈ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్‌గా స్టోక్స్ రికార్డు సృష్టించాడు. అతను కేవలం 124 బంతుల్లోనే 182 పరుగులు చేయడం గమనార్హం. ఇక ఛేజ్‌లో ఇంగ్లండ్ బౌలర్లు ఆకట్టుకోవడంతో న్యూజిల్యాండ్ కేవలం 187 పరుగులకే కుప్పకూలింది. ఇది చూసిన ఫ్యాన్స్ ముఖ్యంగా బెన్ స్టోక్స్ ఆటకు షాకైపోతున్నారు.

ఇంత గొప్పగా ఆడుతున్న అతను అసలు వన్డే ఫార్మాట్‌కు ఎందుకు వీడ్కోలు పలికాడని ప్రశ్నిస్తున్నారు. 'రిటైర్‌మెంట్ నుంచి తిరిగొచ్చిన మూడో మ్యాచులో 76 బంతుల్లో సెంచరీ బాదాడు. అసలు స్టోక్స్ ఎందుకు రిటైర్ అయ్యాడు?' అని అడుగుతున్నారు. స్టోక్స్‌ను రిటైర్‌మెంట్ నుంచి తీసుకొచ్చింది ఇందుకే.. అతను టీంలో ఈ విధ్వంసం తీసుకొస్తాడంటూ కొందరు మెచ్చుకుంటున్నారు.

ఇలాంటి మూడ్‌లో ఉండగా స్టోక్స్‌కు ఎవరూ బౌలింగ్ చేయలేరని మరికొందరు సంతోష పడుతున్నారు. ఏదేమైనా స్టోక్స్ ఇంతలా చెలరేగడం.. వరల్డ్ కప్ ముందు ఇంగ్లండ్ టీంకు చాలా మంచి విషయమే. గత వరల్డ్ కప్‌ను ఇంగ్లండ్ గెలవడంలో స్టోక్స్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

Story first published: Thursday, September 14, 2023, 7:42 [IST]
Other articles published on Sep 14, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+