For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

World Cup 2023: మ్యాక్స్‌వెల్ దెబ్బకు ఈ బౌలర్ కెరీర్ ముగిసినట్లేనా..?

AUSvsNED: క్రికెట్లో అద్భుతాలు జరగడం సహజం. బ్యాట్స్‌మెన్ అయినా, బౌలర్ అయినా తనదైన రోజున రెచ్చిపోయి ఆడతారు. బ్యాటర్లు బౌండరీల వర్షం కురిపిస్తే.. బౌలర్లు వికెట్ల వేట కొనసాగిస్తారు. అలాగే ఒకవేళ టైం బ్యాడ్ అయితే మాత్రం అదే వాళ్ల కెరీర్లో ఆఖరి రోజు కూడా కావచ్చు. తాజాగా ఈ టైం బ్యాడ్ ఆటగాళ్ల జాబితాలో ఓ నెదర్లాండ్స్ బౌలర్ కూడా చేరాడు.

ఢిల్లీ వేదికగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆసీస్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. గ్రౌండ్‌లో బౌండరీల సునామీ సృష్టించాడు. 40 బంతుల్లోనే సెంచరీ బాది వరల్డ్ కప్‌ చరిత్రలోనే అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాటర్‌గానూ రికార్డు నెలకొల్పాడు. కానీ మ్యాక్స్‌వెల్ దెబ్బకి ఇప్పుడు నెదర్లాండ్స్ బౌలర్ బాస్ డీ లీడ్స్ కెరీరే ముగిసిపోయేలా కనిపిస్తోంది.

World Cup 2023 Bas de leeds career is in trouble after Maxwel storm

మ్యాక్స్‌వెల్ దాడికి ఎక్కువగా బలైంది లీడ్సే. ఒక్క లీడ్స్ బౌలింగ్‌లోనే మ్యాక్స్‌వెల్.. 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 50 రన్స్ పిండుకున్నాడు. అది కూడా లీడ్స్ వేసిన 49వ ఓవర్లో అయితే ఏకంగా 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 28 రన్స్ బాదేశాడు. మ్యాక్సీ ధాటికి లీడ్స్ తను వేసిన 10 ఓవర్లలో ఏకంగా 115 పరుగులు సమర్పించుకున్నాడు.

ఇది లీడ్స్ కెరీర్లోనే కాదు.. మొత్తం వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు. ఇప్పటివరకు వన్డేల్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న జాబితాలో ఆస్ట్రేలియాకి చెందిన మెక్ లూయిన్ ఉన్నాడు. 2006లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో లూయిస్ 10 ఓవర్లు వేసి 113 పరుగులిచ్చాడు. ఇక ఈ ఏడాది సౌతాఫ్రికాపైనే ఆస్ట్రేలియా బౌలర్ జంపా కూడా 10 ఓవర్లలో 113 పరుగులే ఇచ్చి లూయిస్ రికార్డును సమం చేశాడు. అయితే ఇప్పుడు వీళ్లిద్దరి రికార్డును లీడ్స్ అధిగమించాడు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చెత్త రికార్డుతో లీడ్స్ క్రికెట్ కెరీరే ప్రమాదంలో పడింది. అయితే మ్యాక్స్‌వెల్ బ్యాటింగ్‌కి రావడానికి ముందు వరకు బాగానే బౌలింగ్ చేసిన లీడ్స్.. ఇంగ్లీస్, లబుషేన్ వికెట్లు కూడా తీసుకున్నాడు. ఇక ఇంతకుముందు పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే ఏకంగా 4 వికెట్లు తీసి అదరగొట్టాడు.

Story first published: Thursday, October 26, 2023, 17:53 [IST]
Other articles published on Oct 26, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+