For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Harbhajan Singh: ఈ గొడవకు కారణం అంపైర్లే.. మాథ్యూస్ అవుట్‌పై మండిపడ్డ భజ్జీ!

వరల్డ్ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ పెద్ద చర్చకు దారి తీసింది. ఈ మ్యాచులో శ్రీలంక బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ అవుటైన విధానంపై మాజీలు, అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచులో.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా మాథ్యూస్‌ను టైమ్ అవుట్‌గా అంపైర్లు ప్రకటించారు.

శ్రీలంక బ్యాటింగ్ చేసిన తొలి ఇన్నింగ్సులో సదీర సమరవిక్రమ (41) అవుటైన తర్వాత ఏంజెలో మాథ్యూస్ క్రీజులోకి వచ్చాడు. అతను బ్యాటింగ్‌కు రెడీ అయిన తర్వాత తన హెల్మెట్ స్ట్రాప్ తెగిపోయి ఉండటాన్ని గమనించాడు. దీంతో మరో హెల్మెట్ కావాలని తన టీంమేట్స్‌ను కోరాడు. ఆ హెల్మెట్ వచ్చేసరికి బంగ్లా టీం అంతా వెళ్లి అంపైర్‌కు అప్పీల్ చేసింది.

 World Cup 2023 BANvsSL Harbhajan Singh blames umpires for Mathews out controvers

క్రికెట్ నిబంధనల ప్రకారం, వికెట్ పడిన తర్వాత రెండు నిమిషాల్లోగా కొత్త ప్లేయర్ బ్యాటింగ్‌కు ఉండాలి. ఆ టైంలో రెడీగా లేకపోతే అతన్ని టైం అవుట్‌గా ప్రకటిస్తారు. ఇదే నిర్ణయం ఎదుర్కొన్న మాథ్యూస్ ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండా పెవిలియన్ చేరాడు. అయితే ఆ తర్వాత చూస్తే ఐదు సెకన్ల ముందే మాథ్యూస్‌ను అవుట్‌గా ప్రకటించినట్లు కనిపించింది.

ఇదే విషయాన్ని మాథ్యూస్ కూడా తన సోషల్ మీడియాలో పంచుకొని, అంపైర్లపై అసహనం వ్యక్తం చేశాడు. దీనిపై టీమిండియా లెజెండ్ హర్భజన్ సింగ్ కూడా స్పందించాడు. అంపైర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'మాథ్యూస్ టైంలోనే క్రీజులోకి వచ్చి బంతి ఎదుర్కోవడానికి రెడీ అయ్యాడు. హెల్మెట్ సెట్ చేసుకున్నప్పుడు హుక్ తెగిపోయిందని అతను గమనించాడు' అని భజ్జీ చెప్పాడు.

'అలా జరిగితే వేరే హెల్మెట్ కావాలని అడగడం తప్పేం కాదు. కొత్త హెల్మెట్ వచ్చేసరికి రెడు నిమిషాలు అయిపోయిందని షకీబ్ అప్పీల్ చేశాడు. అంపైర్లు దానికొ ఒప్పుకున్నారు. మాథ్యూస్ హెల్మెట్ విరిగిందని అంపైర్లకు తెలుసు. అంటే అతను విరిగిన హెల్మెట్‌తో ఆడాలా? హెల్మెట్ లేకపోతే బంతి అతనికి తగిలుంటే.. అప్పుడు కూడా అందరూ అతన్నే హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు? అని తిట్టేవారు' అని హర్భజన్ వివరించాడు.

'అసలు ఇది సమస్యే కాదు. కానీ అతన్ని అవుట్‌గా ప్రకటించడంతో ఇది పెద్ద ఇష్యూ అయింది. ఇది క్రికెట్ ఏదో జోక్ కాదు. మంచు కురుస్తోందని, ప్లేయర్లు కింద పడ్డారని చాలా టైం ఇస్తూనే ఉంటారు. నన్నడిగితే అంపైర్లు ఈ అప్పీల్‌ను అడ్డుకొని ఉండాల్సింది. నాటౌట్ నిర్ణయం ఇవ్వాల్సింది. రూల్స్ ప్రకారమే అయినా సరే.. ఇప్పుడు ఇచ్చింది కరెక్ట్ నిర్ణయమేనా? ఈ కాంట్రవర్సీకి అంపైర్లే కారణం' అని తేల్చేశాడు.

Story first published: Tuesday, November 7, 2023, 15:12 [IST]
Other articles published on Nov 7, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+