ఈ వరల్డ్ కప్ లో మంచి జోరు మీదున్న టీం ఏదైనా ఉందంటే అది న్యూజిలాండ్ అని చెప్పాలి. టోర్నీ ఆరంభ మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ కు గట్టి షాకిచ్చిన ఈ టీమ్.. తమ రెండో మ్యాచులో కూడా చెలరేగింది. ఇప్పుడు బంగ్లాదేశ్ తో తలపడేందుకు రెడీ అయింది. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో కివీస్ రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ రీఎంట్రీ ఇస్తున్నాడు.
వార్మప్ మ్యాచులు ఆడిన కేన్ మామ వరల్డ్ కప్ లో ఆడుతున్న తొలి మ్యాచ్ ఇదే. ఈ మ్యాచులో కుర్ర ఓపెనర్ విల్ యంగ్ స్థానంలో తాను ఆడుతున్నట్లు కేన్ మామ చెప్పాడు. అంతకుమించి జట్టులో ఎలాంటి మార్పులు లేవన్నాడు. టాస్ గెలిచిన అతను ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ బాగుందని, అయితే ఆ తర్వాత మంచు ప్రభావం ఉండే అవకాశం ఉన్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు.

తాము ముందుగా బ్యాటింగ్ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నట్లు బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ చెప్పాడు. చివరి మ్యాచులో అతు బంతితో, ఇటు బ్యాటుతో తమకు సరైన ఆరంభం దక్కలేదని, ఈ మ్యాచులో దాన్ని మార్చాలని అనుకుంటున్నానని తెలిపాడు. మెహదీ హసన్ స్థానంలో మాహ్మదుల్లా ఆడుతున్నట్లు వెల్లడించాడు.
ఇక ఈ పిచ్ నుంచి పేసర్లకు ఆరంభంలో కొంత సహకారం ఉంటుందని తెలుస్తోంది. అయితే ఆ తర్వాత స్పిన్నర్లు ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి బంగ్లాదేశ్ ఈ పరిస్థితిని యూజ్ చేసుకొని కివీస్‌పై పైచేయి సాధించే అవకాశం ఉంది.
న్యూజిల్యాండ్ జట్టు:
డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారియల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ శాంట్నర్, మ్యాట్ హెన్రీ, లోకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్,
బంగ్లాదేశ్ జట్టు:
లిటాన్ దాస్, తంజీద్ హసన్, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), మెహదీ హసన్ మిరాజ్, ముష్ఫికర్ రహీమ్, తౌహీద్ హృదోయ్, మహ్మదుల్లా, టస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లామ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్