Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Babar Azam: బాబర్ వాట్సాప్ చాట్ లీక్ చేసిన పీసీబీ చీఫ్!.. మరీ ఇంత దారుణంగా చేస్తున్నారేంట్రా?

ప్రస్తుతం వరల్డ్ కప్‌లో అత్యంత చెత్త ఫామ్‌లో ఉన్న జట్లలో పాకిస్తాన్ ఒకటి. వరుసగా రెండు విజయాలతో టోర్నీని ప్రారంభించిన పాకిస్తాన్.. ఆ తర్వాత గాడి తప్పింది. వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓటములు చవిచూసింది. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ చేతిలో కూడా పరాభవం ఎదుర్కొంది. ఈ క్రమంలో ఆ టీం ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అలాగే పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను కూడా చాలా మంది విమర్శిస్తున్నారు. ఇంత చెత్త కెప్టెన్సీ అసలు చూడలేదని, బాబర్ నుంచి ఇంకొంచెం మెరుగైన ప్రదర్శన ఆశించామని పలువురు మాజీలు కూడా అన్నారు. మరికొందరైతే అసలు బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ సెటప్‌లు, రివ్యూలు తీసుకోవడంలో కూడా బాబర్ తన మార్కు చూపించలేకపోయాడని తిట్టిపోశారు. దీంతో బాబర్ కెప్టెన్సీ పోస్టు కూడా ప్రమాదంలో పడింది.

World Cup 2023 Babar Azam chat leaked by PCB chairman Zaka Ashraf

ఇలాంటి సమయంలో పాక్ మాజీ దిగ్గజం రషీద్ లతీఫ్ ఒక ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశాడు. 'మీలో చాలామందికి తెలియకపోవచ్చు. కానీ కొన్ని రోజులుగా పీసీబీ చైర్మన్‌తో మాట్లాడేందుకు బాబర్ ప్రయత్నిస్తున్నాడు. కానీ చైర్మన్ మాత్రం మాట్లాడటం లేదు. అందుకే చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సల్మాన్ నజీర్‌తో మాట్లాడుతున్నాడు' అని షాకింగ్ విషయం వెల్లడించాడు.

దీనిపై తాజాగా మాట్లాడిన జాకా అష్రాఫ్.. 'బాబర్ నన్ను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నమే చేయలేదన్నాడు. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌తోనే కెప్టెన్ మాట్లాడతాడు. నాతో కాదు' అని చెప్పాడు. అక్కడితో ఆగకుండా బాబర్, సల్మాన్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్‌ను కూడా అతను లీక్ చేసినట్లు తెలుస్తోంది. ఒక పాకిస్తానీ న్యూస్ ఛానెల్‌లో బాబర్ చాట్‌ను బయటపెట్టారు.

ఆ చాట్‌లో తను జాకా అష్రాఫ్‌ను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించలేదని బాబర్ చెప్తున్నాడు. ఇది చూసిన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. బాబర్ వంటి ఆటగాడి భవిష్యత్తును నాశనం చేసేందుకే పీసీబీ ఇలాంటి చెత్త పనులు చేస్తోందని, పర్సనల్ చాట్స్ ఇలా బయటపెట్టడం ఏంటని నిలదీస్తున్నారు. ఒక మంచి బ్యాటర్ కెరీర్‌ను భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Story first published: Monday, October 30, 2023, 15:37 [IST]
Other articles published on Oct 30, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+