వరల్డ్ కప్ 2023లో రెండు ఏసియా జట్ల మధ్య ఈ రోజు మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్‌లో పాక్, శ్రీలంక జట్లు తలపడుతుండడంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దానికి తోడు ఇరు జట్లలో చెరో మార్పుతో బరిలోకి దిగుతున్నాయి. శ్రీలంక జట్టులో షామ్‌లో ఉన్న మతీషా తీక్షణ జట్టులోకొస్తే.. తమ జట్టులో ఓ వెటరన్ బ్యాటర్‌ను బయటకు పంపించింది పాకిస్తాన్.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ తొలుత బ్యాటింగ్‌కు సహకరించేలా ఉందని, అలాగే పిచ్ టర్న్ లభిస్తుండడం వల్ల బ్యాటింగ్ ఎంచుకున్నట్లు కెప్టెన్ దాషున్ షనక వెల్లడించాడు. అలాగే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బ్యాటింగ్ చేయడమే బెటర్ అని చెప్పుకొచ్చాడు.

ఇక పాక్ కెప్టెన్ బాబర్ మాట్లాడుతూ.. తాను టాస్ గెలిచున్నా బ్యాటింగ్ ఎంచుకునేవాడినని చెప్పాడు. మ్యాచ్‌లో తొలి 10 ఓవర్లు చాలా కీలకమని, ఇక్కడ దాదాపు 10 రోజుల నుంచి ఇక్కడే ఉండడం వల్ల పిచ్‌పై కొంత అవగాహన వచ్చిందని బాబర్ చెప్పుకొచ్చాడు.
అలాగే తమ జట్టులో వెటరన్ ప్లేయర్ ఫఖర్ జమాన్‌ను తొలగించి అతడి స్థానంలో
అబ్దుల్లా షఫీక్‌ను జట్టులోకి తీసుకున్నట్లు బాబర్ చెప్పాడు. ఇక శ్రీలంక జట్టులో కూడా ఓ మార్పు చేసినట్లు చెప్పాడు కెప్టెన్ దాసున్ షనక. రజిత బదులు మతీషా తీక్షణ తిరిగి జట్టులోకొచ్చినట్లు తెలిపాడు.
శ్రీలంక ఫైనల్ ఎలెవెన్ జట్టులో పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరెరా, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వ, దసున్ షనక (కెప్టెన్), దునిత్ వెల్లలగే, మహీశ్ తీక్షణ, మతీశ పతిరనా, దిల్షాన్ మదుషంకా ఉన్నారు.
ఇక పాకిస్తాన్ తరపున అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్‌లు బరిలోకి దిగుతున్నారు.
ఇదిలా ఉంటే వరల్డ్ కప్ 2023లో నెదర్లాండ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించి జోష్ మీదున్న పాకిస్తాన్ రెండో మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడబోతోంది. ఇక తమ తొలి మ్యాచ్‌లో సౌత్‌ఆఫ్రికా చేతిలో ఏకంగా 102 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవి చూసిన శ్రీలంక ఈ మ్యాచ్‌లో ఎలాగైనా పాకిస్తాన్‌ను ఓడించి బోణీ కొట్టాలని పట్టుదలగా ఉంది.