For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

World Cup 2023: సఫారీలకు గట్టి షాకిచ్చిన నెదర్లాండ్స్.. కంగారూలనూ కంగారు పెడుతుందా?

AUSvsNED: ఈ వరల్డ్ కప్‌లో పసికూన దేశాలు పెద్ద జట్లకు వరుస షాక్‌లు ఇస్తున్నాయి. ఏ మాత్రం ఏమరిపాటుగా ఉన్నా.. ఫేవరెట్ జట్లకు ఓటమి తప్పడం లేదు. ఇలాంటి టైంలో ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ మధ్య పోరు రసవత్తరంగా మారింది. ఇప్పటికే నెదర్లాండ్స్ జట్టు పటిష్ఠమైన సౌతాఫ్రికాను ఓడించి సంచలన విజయం సాధించింది. ఈ క్రమంలో ఆసీస్‌కు కూడా నెదర్లాండ్స్ గట్టి పోటీనిచ్చే అవకాశాలు లేకపోలేదు.

ఢిల్లీ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్‌‌లో నెదర్లాండ్స్‌, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించేలా ఉందని, నెదర్లాండ్స్‌పై భారీ స్కోరు నమోదు చేయగలిగితే తప్పుకుండా గెలుస్తామన్నాడు.

World Cup 2023 AUSvsNED Will Netherlands show us another upset against Australia

అయితే ఇప్పటికే గాయం కారణంగా జట్టుకు దూరమైన ట్రావిస్ హెడ్ ఇంకా కోలుకోలేదని, అతడు తిరిగి రావడానికి మరికొన్ని రోజులు పడుతుందన్నాడు. అలాగే ఇన్‌ఫామ్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ కూడా గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమైనట్లు చెప్పాడు. అతడి స్థానంలో కామెరూన్ గ్రీన్‌ జట్టులోకొచ్చాడని చెప్పాడు.

ఇక నెదర్లాండ్స్ కెప్టెన్స్ ఎడ్వర్డ్స్ మాట్లాడుతూ.. తమకు బౌలింగ్ రావడం మంచిదేనన్నాడు. తాను టాస్ గెలిచుంటే బౌలింగే ఎంచుకునేవాడినన్నాడు. తమ బౌలింగ్‌తో ఆస్ట్రేలియాను తక్కువ స్కోరుకు కట్టడి చేయగలిగితే మ్యాచ్‌పై పట్టు సాధించగలమన్నాడు.

ఆస్ట్రేలియా జట్టు:
డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, ఆడమ్ జంపా

నెదర్లాండ్స్ జట్టు:
విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓ'దౌద్, కోలిన్ అకెర్‌మాన్, బాస్ డి లీడే, తేజా నిడమనూరు, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్ & వికెట్ కీపర్), సిబ్రాండ్ ఎంగెల్‌‌బ్రట్, లోగన్ వాన్ బీక్, రోలాఫ్ వాన్ డర్ మెర్వ్, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకరన్.

Story first published: Wednesday, October 25, 2023, 14:45 [IST]
Other articles published on Oct 25, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+