For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

World Cup 2023: సింపుల్ రనౌట్.. అదొక్కటీ చేసుంటే నెదర్లాండ్స్ గెలిచేదేమో?

ఆస్ట్రేలియాతో మ్యాచులో పసికూన నెదర్లాండ్స్ చిన్న చిన్న తప్పిదాలు చేసింది. వాటికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. వాటిలో వార్నర్ సెంచరీ కూడా ఒకటి కావడం గమనార్హం. ఈ స్టార్ ఓపెనర్ ఈ మ్యాచులో సెంచరీతో ఆకట్టుకున్నాడు. వార్నర్ దూకుడుగా ఆడటం వల్లనే ఆసీస్ భారీ స్కోరుకు పునాది పడిందని చెప్పొచ్చు.

అయితే అతని ఇన్నింగ్స్ ఆరంభంలోనే వార్నర్‌ను అవుట్ చేసే అవకాశం నెదర్లాండ్స్‌కు వచ్చింది. కానీ వాళ్లు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఆసీస్ బ్యాటింగ్ 17వ ఓవర్లో కోలిన్ ఆకర్‌మన్ బౌలింగ్ వేశాడు. అతను వేసిన డెలివరీని మిడ్ వికెట్ మీదుగా పంపించిన వార్నర్ వేగంగా సింగిల్ కోసం వచ్చేశాడు.

World Cup 2023 AUSvsNED This missed opportunity costed Netherlands the match

ఆ సమయంలో నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న స్టీవ్ స్మిత్.. పరుగు ప్రారంభించిన వెంటనే అక్కడ రన్ లేదని వెనుతిరిగాడు. ఎందుకంటే అప్పటికే అక్కడ ఉన్న ఫీల్డర్ మ్యాక్స్ ఓ దౌద్.. బంతిని అడ్డుకున్నాడు. దీంతో స్మిత్, వార్నర్ ఇద్దరూ నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపే పరుగు తీశారు. ఇలా స్మిత్ వెనక్కు వెళ్లిపోవడం చూసిన వార్నర్.. తను వెనుతిరిగి తన క్రీజు వైపు పరుగు తీశాడు.

కానీ బంతిని అడ్డుకున్న మ్యాక్స్ ఓ దౌద్.. దాన్ని అందుకోవడంలో అతను తడబడ్డాడు. వేగంగా వచ్చి బంతిని అడ్డుకున్న అతను దాన్ని అక్కడే వదిలేసి అదే ఊపులో ముందుకు వెళ్లిపోయాడు. అతను తిరిగి వచ్చి బంతిని తీసుకొని కీపర్‌కు విసిరే సమయానికి వార్నర్ సేఫ్‌గా క్రీజు దాటేశాడు. అప్పటికి వార్నర్ స్కోరు కేవలం 32 పరుగులే.

ఇలా తనకు దక్కిన లైఫ్‌ను చక్కగా ఉపయోగించుకున్న వార్నర్ ఎక్కడా తగ్గకుండా వేగంగా ఆడాడు. 104 పరుగులతో ఈ వరల్డ్ కప్‌లో వరుసగా రెండో సెంచరీ నమోదు చేశాడు. అతనితోపాటు స్టీవ్ స్మిత్ (71), మార్నస్ లబుషేన్ (62) కూడా రాణించారు. చివర్లో మ్యాక్స్‌వెల్ (106) చెలరేగడంతో ఆసీస్ 399 పరుగుల భారీ స్కోరు చేసింది.

బౌలర్లు కూడా రాణించడంతో నెదర్లాండ్స్‌ను కేవలం 90 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో 309 పరుగుల తేడాతో విజయం సాధించిన కంగారూలు.. వరల్డ్ కప్ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేశారు. అదే కనుక వార్నర్ 32 పరుగులకే రనౌట్ అయ్యి ఉంటే.. ఆసీస్ ఇంత భారీ స్కోరు చేయగలిగేది కాదని ఫ్యాన్స్ అంటున్నారు. ఆ రనౌట్ వల్లనే నెదర్లాండ్స్ ఓడిందంటున్నారు.

Story first published: Thursday, October 26, 2023, 8:08 [IST]
Other articles published on Oct 26, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+