For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

World Cup 2023: ఇదేం చూశారు.. ముందుంది మొసళ్ల పండుగ: ప్యాట్ కమిన్స్

ఆస్ట్రేలియా టీం వరల్డ్ కప్ చరిత్రలోనే అతిపెద్ద విజయం నమోదు చేసింది. పసికూన నెదర్లాండ్స్‌ను ఏకంగా 309 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచులో ఆసీస్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్‌కు అనుకున్న ఆరంభం దక్కలేదు. స్టార్ ఓపెనర్ మిచెల్ మార్ష్ (9) విఫలమయ్యాడు. అయితే మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (104) వరుసగా రెండో సెంచరీతో ఆకట్టుకున్నాడు.

ఇక అతనికి జత కలిసిన స్టీవ్ స్మిత్ (71), మార్నస్ లబుషేన్ (62) కూడా వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఇక చివర్లో బరిలో దిగిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ (106) ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. ఎడాపెడా బౌండరీలు బాదేశాడు. ఈ క్రమంలో కేవలం 40 బంతుల్లోనే సెంచరీ చేసి, వరల్డ్ కప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన శతకం నమోదు చేశాడు. దీంతో ఆస్ట్రేలియా ఏకంగా 399 పరుగులు చేసింది.

World Cup 2023 AUSvsNED Pat Cummins wants his team to improve even more

నెదర్లాండ్స్ బౌలర్లలో లోగన్ వాన్ బీక్ నాలుగు వికెట్లు తీసుకున్నా కూడా ఆసీస్‌ జోరుకు కళ్లెం వేయలేకపోయాడు. భారీ లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ తేలిపోయింది. ఆ టీం ఓపెనర్ విక్రమ్‌జీత్ సింగ్ (25) మినహా మరెవరూ కనీసం 15 పరుగుల మార్కు దాటలేదంటేనే వాళ్లు ఎలా ఆడారో అర్థం చేసుకోవచ్చు.

ఆసీస్ బౌలర్లలో బంతి అందుకున్న ప్రతి ఒక్కరూ వికెట్ తీసుకున్నారు. చివర్లో బంతి అందుకున్న ఆడమ్ జంపా అయితే కేవలం మూడు ఓవర్లే వేసి నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ విజయంపై ఆసీస్ సారధి ప్యాట్ కమిన్స్ సంతోషం వ్యక్తం చేశాడు.

'ఇంత కన్నా సంతోషం ఏముంటుంది? మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్స్ క్రేజీ అని చెప్పాలి. కానీ ఆ వంద పరుగుల భాగస్వామ్యంలో మేం ఇద్దరం సమానమైన భాగస్వాములమే' అంటూ నవ్వేశాడు. 'మా సత్తాకు తగ్గట్లు ఆడటం మొదలు పెట్టాం. మాకు మంచి బ్యాటింగ్ పవర్‌ప్లే కూడా కలిసొచ్చింది' అన్నాడు.

'మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసుకోవడమే మా లక్ష్యం. మేం చక్కగా బౌలింగ్ చేసినా అదృష్టం కలిసి రాలేదు. జంపా చెలరేగుతున్నాడు. కివీస్‌తో మ్యాచ్‌కు గట్టిగా రెడీ అవుతున్నాం. అది బలమైన జట్టు. అది చాలా పెద్ద గేమ్. బ్యాటింగ్‌లో ఇంకా యాభై ఓవర్లు చెలరేగలేదు. దానిపై ఫోకస్ పెడుతున్నాం. ఇక మా లక్ష్యం అదే' అని తెలిపాడు. ఇది ఒక విధంగా మిగతా జట్లకు వార్నింగే అని ఫ్యాన్స్ అంటున్నారు.

Story first published: Wednesday, October 25, 2023, 22:22 [IST]
Other articles published on Oct 25, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+