For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

World Cup 2023: తగ్గేదేలే.. మళ్లీ సెంచరీ బాదిన వార్నర్ మామ!

పసికూన నెదర్లాండ్స్‌పై ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ చెలరేగాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన అతను తన కెరీర్‌లో 22వ శతకం నమోదు చేశాడు. ఈ వరల్డ్ కప్‌లో ఇది వార్నర్‌కు వరుసగా రెండో సెంచరీ కావడం గమనార్హం. ఇంతకుముందు పాకిస్తాన్‌పై కూడా భారీ శతకంతో వార్నర్ మెరిశాడు.

కొన్ని రోజుల క్రితం వరకు వార్నర్ చాలా పేలవ ఫామ్‌లో ఉన్నాడు. దీంతో అతన్ని అసలు వరల్డ్ కప్ ఆడించాలా? వద్దా? అని చాలా మంది నిపుణులు ఆలోచించారు. కొంత మంది ఫ్యాన్స్ అయితే వార్నర్ వల్ల జట్టుకు ఎలాంటి ఉపయోగం లేదని, టీంకు అవసరమైన ధనాధన్ ఓపెనింగ్ అందించడం వార్నర్ వల్ల కావడం లేదని మండిపడ్డారు.

World Cup 2023 AUSvsNED David Warner smashes second consecutive century

ఈ అవమానాలన్నీ అనుభవించిన వార్నర్.. సరిగ్గా వరల్డ్ కప్ ముందు ఫామ్ అందుకున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన ఐదు వన్డేల సిరీసును ఘనంగా ఆరంభించాడు. కానీ చివరి మూడు వన్డేల్లో పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో మరోసారి అతనిపై విమర్శలు వచ్చాయి. ఇక వరల్డ్ కప్‌లో భారత్‌తో జరిగిన తమ తొలి మ్యాచులో హాఫ్ సెంచరీతో మెరిశాడు.

దీంతో అతని ఫ్యాన్స్ కూడా సంతోషించారు. అదే జోరు కొనసాగిస్తూ వచ్చిన వార్నర్.. తాజాగా పాకిస్తాన్‌పై విశ్వరూపమే చూపించాడు. డబుల్ సెంచరీ చేసేలా కనిపించిన అతను చివరకు 163 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ఆసీస్‌కు కొండంత స్కోరు అందించాడు. ఫీల్డింగ్‌లో కూడా వార్నర్ అద్భుతంగా రాణిస్తున్నాడు.

ఇక ఇప్పుడు ఢిల్లీ వేదికగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కూడా సెంచరీతో రాణించాడు. 93 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో ఏకంగా 104 రన్స్ చేసి టోర్నీలో రెండో సెంచరీ బాదేశాడు. అయితే సెంచరీ బాదిన కొద్ది సేపటికే ఆర్యన్ దత్ బౌలింగ్‌లో వ్యాన్ బీక్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

నెదర్లాండ్స్‌పై కూడా శతకం బాదిన వార్నర్.. తనదైన శైలిలో 'పుష్ప' స్టైల్‌లో సెలబ్రేట్ చేసుకున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్ అంతా కూడా 'మా వార్నర్ మామ తిరిగొచ్చేశాడురా' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు వార్నర్‌ను ఎవరూ ఆపలేరంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా విడుదలైన ఐసీసీ వన్డే బ్యాటర్ ర్యాకింగ్స్‌‌లో కూడా వార్నర్ ముందడుగు వేశాడు. విరాట్ కోహ్లీతో సమానంగా 747 పాయింట్లతో 5వ ర్యాంకు చేరుకున్నాడు. ప్రస్తుతం వీళ్లిద్దరూ అద్భుతమైన ఫామ్‌లో ఉండి, తమ తమ టీమ్స్‌ బ్యాటింగ్ విభాగానికి వెన్నెముకలుగా మారిన సంగతి తెలిసిందే.

Story first published: Wednesday, October 25, 2023, 17:46 [IST]
Other articles published on Oct 25, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+