Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: గెలుపంటే ఇదేరా.. వరల్డ్ కప్ చరిత్ర తిరగరాసిన కంగారూలు!

AUSvsNED: వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా టీం రికార్డుల మోత మోగించింది. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచులో వరుస పెట్టి రికార్డులు బద్దలు కొట్టింది. వరల్డ్ కప్ చరిత్రలోనే అతిపెద్ద విజయం నమోదు చేసింది. ఈ మ్యాచులో ఏకంగా 309 పరుగుల తేడాతో పసికూన నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచులో ఆసీస్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు అనుకున్న ఆరంభం దక్కలేదు. స్టార్ ఓపెనర్ మిచెల్ మార్ష్ (9) విఫలమయ్యాడు. అయితే మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (104) వరుసగా రెండో సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇక అతనికి జత కలిసిన స్టీవ్ స్మిత్ (71), మార్నస్ లబుషేన్ (62) కూడా వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.

 World Cup 2023 AUSvsNED Australia creates history with a humongous victory

ఇక చివర్లో బరిలో దిగిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ (106) ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. ఎడాపెడా బౌండరీలు బాదేశాడు. ఈ క్రమంలో కేవలం 40 బంతుల్లోనే సెంచరీ చేసి, వరల్డ్ కప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన శతకం నమోదు చేశాడు. దీంతో ఆస్ట్రేలియా ఏకంగా 399 పరుగులు చేసింది.

నెదర్లాండ్స్ బౌలర్లలో లోగన్ వాన్ బీక్ నాలుగు వికెట్లు తీసుకున్న ఆసీస్‌ జోరుకు కళ్లెం వేయలేకపోయాడు. అదే సమయంలో మరో కీలక బౌలర్ బాస్ డీ లీడ్స్‌ను మ్యాక్స్‌వెల్ ఒక ఆట ఆడుకున్నాడు. దీంతో అతను 10 ఓవర్లలో ఏకంగా 115 పరుగులు ఇచ్చి క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డు తన పేరిట రాసుకోవాల్సి వచ్చింది.

ఇంత భారీ లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ తేలిపోయింది. ఆ టీం ఓపెనర్ విక్రమ్‌జీత్ సింగ్ (25) మినహా మరెవరూ కనీసం 15 పరుగుల మార్కు దాటలేదంటేనే వాళ్లు ఎలా ఆడారో అర్థం చేసుకోవచ్చు. ఆసీస్ బౌలర్లలో బంతి అందుకున్న ప్రతి ఒక్కరూ వికెట్ తీసుకున్నారు. చివర్లో బంతి అందుకున్న ఆడమ్ జంపా అయితే కేవలం మూడు ఓవర్లే వేసి నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇలా ఆసీస్ బౌలింగ్ విభాగం కూడా చెలరేగడంతో నెదర్లాండ్స్ జట్టు 21 ఓవర్లలో కేవలం 90 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఆసీస్ 309 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. ఇది వరల్డ్ కప్ చరిత్రలోనే అతిపెద్ద విజయం కావడం గమనార్హం. బ్యాటుతో విజృంభించిన గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.

Story first published: Wednesday, October 25, 2023, 21:04 [IST]
Other articles published on Oct 25, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+