Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AUSvsENG: తడబడి నిలబడిన ఆసీస్.. ఇంగ్లండ్ ముందు ఆ స్కోరు సరిపోతుందా?

ఇంగ్లండ్‌తో జరుగుతున్న కీలక పోరులో ఆస్ట్రేలియా బ్యాటర్లు తడబడ్డారు. మంచి ఫామ్‌లో ఉన్న మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ లేని లోటు ఈ మ్యాచులో స్పష్టంగా కనిపించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. ట్రావిస్ హెడ్ (11), డేవిడ్ వార్నర్ (15) ఇద్దరూ ఫెయిలయ్యారు.

అయితే ఆ తర్వాత వచ్చిన స్టీవ్ స్మిత్ (44), మార్నస్ లబుషేన్ (71) అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే గేరు మార్చే క్రమంలో వీళ్లిద్దరూ అవుటయ్యారు. ఆ తర్వాత వచ్చిన కామెరూన్ గ్రీన్ (47) కూడా చక్కగా ఆడాడు. అతను కనుక క్రీజులో ఉంటే ఆసీస్ స్కోరు ఈజీగా 300 దాటుతుందని అంతా అనుకున్నారు.

World Cup 2023 AUSvsENG England restricts Australia for a gettable total

కానీ డేవిడ్ విల్లీ బౌలింగ్‌లో గ్రీన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక సింగిల్స్, డబుల్స్ తీయడానికి ఇబ్బంది పడుతున్న మార్కస్ స్టొయినిస్ (35) అప్పటికి ఇంకా క్రీజులో కుదురుకోలేదు. దానికితోడు అప్పటికి ఆసీస్ స్కోరు కేవలం 223 పరుగులే.. దీంతో ఆసీస్ కనీసం 250 చేసినా గొప్పే అని ఫ్యాన్స్ అనుకున్నారు.

కానీ చివర్లో స్టొయినిస్ కొన్ని భారీ షాట్లు ఆడాడు. అతను అవుటైన తర్వాత వచ్చిన ప్యాట్ కమిన్స్ (10) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. ఇలాంటి సమయంలో ఆడమ్ జంపా (19 బంతుల్లో 29) ధాటిగా ఆడాడు. భారీ షాట్లు కొట్టేందుకే ప్రయత్నించిన అతనికి అదృష్టం కూడా కలిసొచ్చింది. ఇక అతను అవుటైన కాసేపటికే మిచెల్ స్టార్క్ (10) కూడా పెవిలియన్ చేరాడు.

దీంతో ఆసీస్ 49.3 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ నాలుగు వికెట్లతో రాణించాడు. మార్క్ వుడ్, అదిల్ రషీద్ ఇద్దరూ చెరో రెండు వికెట్లతో సత్తా చాటారు. ప్రస్తుతం ఇంగ్లండ్ బ్యాటింగ్ అంత గొప్ప ఫామ్‌లో లేకపోయినా.. బలమైన ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ ముందు ఈ స్కోరు సరిపోతుందా? అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

Story first published: Saturday, November 4, 2023, 18:40 [IST]
Other articles published on Nov 4, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+